Smita Sabharwal: మణిపూర్ ఘటనపై తీవ్రంగా స్పందించిన స్మితా సబర్వాల్.. రాష్ట్రపతిని ట్యాగ్ చేస్తూ సంచలన కామెంట్స్..

Smita Sabharwal on Manipur Incident: మణిపూర్‌లో చోటు చేసుకున్న ఘటనపై యావత్ దేశం స్పందిస్తోంది. మే 4న ఇద్దరు కుకీ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడి దుస్తులు విప్పేసిన ఘటనపై అటు పార్లమెంట్ సైతం దద్ధరిల్లుతోంది. ఈ క్రమంలో మణిపూర్ ఘటనపై..

Smita Sabharwal: మణిపూర్ ఘటనపై తీవ్రంగా స్పందించిన స్మితా సబర్వాల్.. రాష్ట్రపతిని ట్యాగ్ చేస్తూ సంచలన కామెంట్స్..
Smita Sabharwal On Manipur Incident
Follow us

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jul 22, 2023 | 12:23 PM

Smita Sabharwal on Manipur Incident: మణిపూర్‌లో చోటు చేసుకున్న ఘటనపై యావత్ దేశం స్పందిస్తోంది. మే 4న ఇద్దరు కుకీ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడి దుస్తులు విప్పేసిన ఘటనపై అటు పార్లమెంట్ సైతం దద్ధరిల్లుతోంది. ఈ క్రమంలో మణిపూర్ ఘటనపై స్పందించారు తెలంగాణ ఐఏఎస్ స్మిత సబర్వాల్. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా మణిపూర్ ఘటనపై స్పందించారు.

మణిపూర్ ఘటనపై ఘాటుగా స్పందించిన స్మిత సబర్వాల్.. చరిత్రలో ఎలాంటి కలహాలు జరిగినా మహిళలు నీస్సహాయ స్థితిలో నిలుస్తున్నారని. మణిపూర్‌లో 70 రోజుల ముందు జరిగిన భయంకర హింసకాండలో నిస్సహాయులైన అమాయక మహిళలను ఊరేగింపు చేస్తూ 50 వేల మంది ముందు నిలబెట్టారని ప్రస్తావించారు. ఇది మన మూలాలను కదిలిస్తోందని, ఇంత జరుగుతుంటే మీడియా ఏం చేస్తుందని, ఎందుకు మణిపూర్‌ను అలా వదిలేశారని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

రాష్ట్రపతి చర్యలు తీసుకోవాలి..

మణిపూర్ ఘటనపై ట్వీట్ చేసిన స్మితా సబర్వాల్ రాష్ట్రపతిని కూడా ట్యాగ్ చేశారు. మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై రాజ్యాంగపరమైన అధికారాలను అమలు చేయాల్సిందిగా ఆమె ప్రెసిడెంట్‌ను కోరారు. నైతికత లేని మెజారిటీ మనోభావాలు మన నాగరికతను నాశనం చేసేలా ఉన్నాయని స్మితా సబర్వాల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..