రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. తిరుపతి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు ఇకపై..!

Jan Aushadhi Kendra: ఇండియన్ రైల్వేస్ ప్రధాన్ మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాల ఏర్పాటుకు నూతన విధానాన్ని రూపొందించింది. దీని ద్వారా రైల్వే స్టేషన్ల ప్రాంగణ  ప్రాంతాల్లో  ప్రధాన్ మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇంకా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్, తిరుపతి రైల్వే స్టేషన్లతో సహా దేశవ్యాప్తంగా ఉన్న 50 రైల్వే స్టేషన్లు పైలట్ ప్రాజెక్ట్ కోసం గుర్తించబడ్డాయి. రోజువారీ మిలియన్ల కొద్దీ ప్రయాణించే రైల్వే సందర్శకులు, వారి అవసరాలను తీర్చడానికి,

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. తిరుపతి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు ఇకపై..!
Jan Aushadhi Kendra
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 12, 2023 | 4:30 PM

Jan Aushadhi Kendra: రైల్వే స్టేషన్‌లను సందర్శించే ప్రయాణీకుల క్షేమం, సంక్షేమాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా, ఇండియన్ రైల్వేస్ ప్రధాన్ మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాల ఏర్పాటుకు నూతన విధానాన్ని రూపొందించింది. దీని ద్వారా రైల్వే స్టేషన్ల ప్రాంగణ  ప్రాంతాల్లో  ప్రధాన్ మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇంకా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్, తిరుపతి రైల్వే స్టేషన్లతో సహా దేశవ్యాప్తంగా ఉన్న 50 రైల్వే స్టేషన్లు పైలట్ ప్రాజెక్ట్ కోసం గుర్తించబడ్డాయి. రోజువారీ మిలియన్ల కొద్దీ ప్రయాణించే రైల్వే సందర్శకులు, వారి అవసరాలను తీర్చడానికి, భారతీయ రైల్వే స్టేషన్లలో ఆరోగ్య సౌకర్యాలు, సంక్షేమ సౌకర్యాలను ఇది స్థిరంగా అభివృద్ది చేస్తోంది.

రైల్వే స్టేషన్లలో పిఎమ్‌బి‌జే‌కె స్థాపించడానికి ప్రధాన లక్ష్యాలివే..

  1. ప్రయాణికులకు నాణ్యమైన మందులు, వినియోగ వస్తువులు( జనౌషధి ఉత్పత్తులు) అందరికీ అందుబాటు ధరలో అందుబాటులో ఉంచాలనే భారత ప్రభుత్వ మిషన్‌‌ని ప్రచారం చేయడం.
  2. రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులు/సందర్శకులు జనౌషధి ఉత్పత్తులను సులభంగా అందుబాటు చేయడానికి వీలు కల్పించడం.
  3. సరసమైన ధరలకే మందులను అందించడం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల్లో ఆరోగ్యం, సంక్షేమాన్ని పెంపొందించడం.
  4. ఉపాధి అవకాశాలను సృష్టించడం, ఈ కేంద్రాలను తెరవడానికి వ్యవస్థాపకులకు మార్గాలను రూపొందించడం .

నిజానికి ఇది ప్రజలకు అత్యవసరమైన సౌకర్యంగా పరిగణించబడింది. తదనుగుణంగా రైల్వే లైసెన్సుల ద్వారా వాణిజ్య మార్గాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు, ప్రయాణ ప్రాంగణంలో, స్టేషన్‌ల్లో ఫ్యాబ్రికేటెడ్ అవుట్‌లెట్‌లను అందిస్తుంది. అవుట్‌లెట్‌లు సౌకర్యవంతమైన ప్రదేశాలలో సర్క్యులేటింగ్ ప్రాంతాలు ఉంటాయి. తద్వారా  సందర్శించే ప్రయాణికులు ప్రయోజనం పొందుతారు. రైల్వే డివిజన్ల ద్వారా గుర్తించబడిన ప్రదేశాలలో పి .ఎమ్. బి. జే .కె లను లైసెన్సుల ద్వారా ఏర్పాటు చేసి నిర్వహిస్తారు. IREPS ద్వారా సంబంధిత రైల్వే డివిజన్‌ల మాదిరిగానే ఈ-వేలం ద్వారా స్టాల్స్ అందించబడతాయి. ఈ స్టాల్స్‌ను ఎన్‌ఐడి అహ్మదాబాద్ డిజైన్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

అయితే అవుట్‌లెట్‌ల విజయవంతమైన బిడ్డర్లు ఔషధ దుకాణాన్ని నిర్వహించడానికి అవసరమైన అనుమతులు, లైసెన్స్‌ను పొందాలి. అలాగే ఔషధాల నిల్వ కోసం అన్నిరకాల చట్టబద్ధమైన అవసరాలకు అనుగుణంగా ఉండాలి. జనౌషధి స్కీమ్ పి .ఎమ్. బి. జే .కె చే  నిర్దేశించినట్లుగా  ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి.