TSPSC Paper Leak: ఒకవైపు సిట్‌, ఇంకోవైపు కేటీఆర్‌.. రేవంత్‌, బండి సంజయ్‌కి నోటీసులు..

TSPSC పేపర్స్‌ లీకేజీ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఒకవైపు జెట్‌ స్పీడ్‌తో సిట్‌ దర్యాప్తు చేస్తుంటే, మరోవైపు పొలిటికల్‌ దుమారం రచ్చ సృష్టిస్తోంది. లేటెస్ట్‌గా రేవంత్‌ అండ్‌ బండి సంజయ్‌కి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది.

TSPSC Paper Leak: ఒకవైపు సిట్‌, ఇంకోవైపు కేటీఆర్‌.. రేవంత్‌, బండి సంజయ్‌కి నోటీసులు..
Revanth Reddy Bandi Sanjay
Follow us
Venkata Chari

|

Updated on: Mar 24, 2023 | 4:38 AM

TSPSC పేపర్స్‌ లీకేజీ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఒకవైపు జెట్‌ స్పీడ్‌తో సిట్‌ దర్యాప్తు చేస్తుంటే, మరోవైపు పొలిటికల్‌ దుమారం రచ్చ సృష్టిస్తోంది. లేటెస్ట్‌గా రేవంత్‌ అండ్‌ బండి సంజయ్‌కి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. అదే టైమ్‌లో రేవంత్‌పై లీగల్ యాక్షన్‌కి రెడీ అవుతోంది సిట్‌.

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వేరు, ప్రభుత్వం వేరు, ఇది కూడా తెలియదా? ఇంగిత జ్ఞానంలేని అజ్ఞానులారా! అంటూ రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌పై నిప్పులు చెరిగారు కేటీఆర్‌. వెకిలి మకిలి ఆరోపణలు చేస్తూ బట్టగాల్చి మీదేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వార్నింగ్‌ ఇవ్వడమే కాదు.. ఇద్దరికీ లీగల్‌ నోటీసులు పంపారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించండి, లేదంటే లీగల్‌ యాక్షన్‌కి రెడీ కావాలంటూ హెచ్చరికలు పంపారు.

TSPSC పేపర్స్‌ లీకేజీకి మంత్రి కేటీఆర్‌కి సంబంధముందనేది రేవంత్‌, బండి సంజయ్‌ చేస్తోన్న ఆరోపణలు. అసలింతకీ వాళ్లిద్దరూ ఏమన్నారో ఒకసారి చూద్దాం.

ఇవి కూడా చదవండి

కేవలం, రాజకీయ దురుద్దేశం, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలన్న కుట్రతోనే తన పేరును లాగుతున్నారన్నారు కేటీఆర్‌. ఇందులో మరో కుట్ర కూడా ఉందన్నారు. ఉద్యోగాల జాతరకు పాతరేయడం, మొత్తం నియామక ప్రక్రియను ఆపేయాలనే కుతంత్రం ఉందన్నారు. యువత ఇది గమనించి ఆ రెండు పార్టీల ఉచ్చులో పడొద్దంటూ విజ్ఞప్తి చేశారు కేటీఆర్‌.

ఒకవైపు రేవంత్‌ అండ్ బండి సంజయ్‌కి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు పంపిస్తే, ఆల్రెడీ ఆ ఇద్దరికీ నోటీసులిచ్చింది సిట్‌. ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని కోరింది. అయితే, రేవంత్‌ సిట్‌ ముందు హాజరైనా ఆధారాలు ఇవ్వకపోవడంతో యాక్షన్‌కి సిద్ధమవుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..