Doctor Ruth John Koyyala: చరిత్ర సృష్టించిన తెలంగాణ ట్రాన్స్‌జెండర్ రూత్ జాన్.. రెండేళ్ల పోరాటం తర్వాత..

Doctor Ruth John Koyyala: నేటి సమాజంలో ట్రాన్స్ జెండర్‌లకు ఎక్కడా పెద్దగా గుర్తింపు ఉండదు. ఎవరూ వారిని ఉద్యోగాల్లోకి తీసుకోరు.. అంతెందుకు అసలు వారిలో చదువుకున్న వారు సైతం చాలా అరుదుగా కనిపిస్తారు. దీంతో ఎక్కడికి వెళ్లినా.. ఏదో ఒక రూపంలో డబ్బులు తీసుకోవడం తప్ప వారికి ఏమీ చేతకాదన్న భావన ఏర్పడింది.. అయితే అలాంటి సంక్లిష్ట పరిస్థితులను దాటుకొని ఒక ట్రాన్స్‌జెండర్ చరిత్ర సృష్టించింది. ట్రాన్స్‌జెండర్ కేటగిరీలో ఖమ్మం జిల్లాకు చెందిన రూత్ జాన్ పీజీ మెడికల్ సీటు సంపాదించింది..

Doctor Ruth John Koyyala: చరిత్ర సృష్టించిన తెలంగాణ ట్రాన్స్‌జెండర్ రూత్ జాన్.. రెండేళ్ల పోరాటం తర్వాత..
Doctor Ruth John Koyyala
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Aug 23, 2023 | 1:59 PM

హైదరాబాద్, ఆగస్టు 23: నేటి సమాజంలో ట్రాన్స్ జెండర్‌లకు ఎక్కడా పెద్దగా గుర్తింపు ఉండదు. ఎవరూ వారిని ఉద్యోగాల్లోకి తీసుకోరు.. అంతెందుకు అసలు వారిలో చదువుకున్న వారు సైతం చాలా అరుదుగా కనిపిస్తారు. దీంతో ఎక్కడికి వెళ్లినా.. ఏదో ఒక రూపంలో డబ్బులు తీసుకోవడం తప్ప వారికి ఏమీ చేతకాదన్న భావన ఏర్పడింది.. అయితే అలాంటి సంక్లిష్ట పరిస్థితులను దాటుకొని ఒక ట్రాన్స్‌జెండర్ చరిత్ర సృష్టించింది. ట్రాన్స్‌జెండర్ కేటగిరీలో ఖమ్మం జిల్లాకు చెందిన 29 ఏళ్ల రూత్ జాన్ కొయ్యల పీజీ మెడికల్ సీటు సంపాదించింది.. అయితే దేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ట్రాన్స్‌జెండర్లు ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లాకు చెందిన రూత్.. రూటే సపరేటు. చాలామంది ట్రాన్స్ జెండర్లు ఎంబీబీఎస్ చదివినప్పటికీ వారికి కేటాయించిన సీటు మాత్రం స్త్రీ పురుష కేటగిరీ కిందనే ఉంది. కానీ ఖమ్మం జిల్లాకు చెందిన రూత్.. తనకు ట్రాన్స్‌జెండర్ కేటగిరిలోనే సీటు కేటాయించాలని పట్టుబట్టింది.

రూత్ జాన్.. 2022లో నీట్ ద్వారా సీటు వచ్చినప్పటికీ ఆ మెడికల్ సీటును తిరస్కరించింది.. మహిళ కేటగిరిలో పీజీ సీట్ వచ్చినప్పటికీ తనకు ట్రాన్స్‌జెండర్ కేటగిరిలోనే సీట్ అలాట్ చేయాలని పోరాటం చేసింది. ప్రస్తుతం ఉస్మానియాలో మెడికల్ ఆఫీసర్‌గా పని చేస్తుంది. ఈ క్రమంలోనే నీట్ పరీక్ష క్లియర్ చేసిన రూత్ తనకి ట్రాన్స్ జెండర్ కేటగిరిలోనే సీట్ కేటాయించాలని అధికారులకు, మంత్రులకు, సంబంధిత శాఖలకు 20 వినతి పత్రాలు అందజేసింది. ఎవరూ కూడా సానుకూలంగా లేకపోవడంతో చివరికి చేసేది లేక హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఒక సీటు ట్రాన్స్‌జెండర్ కేటగిరీలో ఉంచాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ సమయంలో రూత్‌ ఈఎస్ఐ హాస్పిటల్లోని ఎమర్జెన్సీ విభాగంలో పనిచేస్తూ అవిశ్రాంతంగా పోరాడింది. రెండు సంవత్సరాల పోరాటం తర్వాత ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు నుంచి వచ్చిన ఉత్తర్వులతో ఆమె పట్టుదల ఫలించింది.

కాలేజ్ ఫీజ్ కట్టేందుకు ముందుకొచ్చిన దాతలు

ఈఎస్ఐ హాస్పిటల్లో పీజీ సీట్ వచ్చిన తర్వాత సంవత్సరానికి రూ .2.5 లక్షల రూపాయలు ఫీజు కట్టాల్సి ఉంది. హాస్పిటల్ సూపర్నెంట్ విజ్ఞప్తితో తోటి కొలీగ్స్ సహాయంతో లక్ష రూపాయల వరకు ఫండ్ రైజ్ అయ్యింది. పలువురు న్యాయవాదులు సైతం ట్రాన్స్ జెండర్ మెడికల్ ఫీజు కట్టేందుకు ముందుకువచ్చారు. మిగతా లక్ష రూపాయలను స్వచ్చంద సంస్థ హెల్పింగ్ హాండ్స్ కట్టింది.

ఇవి కూడా చదవండి

గైనకాలజిస్ట్ అవ్వడమే నా లక్ష్యం: ట్రాన్స్‌జెండర్ రూత్

ట్రాన్స్ జెండర్లు ఆపరేషన్ చేయించుకొని ఇతర జెండర్‌లోకి మారినాక చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని రూత్ తెలిపింది. అందుకే తాను గైనకాలజిస్ట్ అయి తన కమ్యూనిటీకి మెరుగైన సేవలు అందిస్తానని ఖమ్మం జిల్లాకు చెందిన రూత్ తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..