Minister KTR: రాజకీయాలు వేరు.. అభివృద్ధి వేరు.. మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

మంత్రి కేటీఆర్ మరోసారి మోడీ సర్కార్‌పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌ అభివృద్ధిపై కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Minister KTR: రాజకీయాలు వేరు.. అభివృద్ధి వేరు.. మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Ktr
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 28, 2023 | 1:25 PM

మంత్రి కేటీఆర్ మరోసారి మోడీ సర్కార్‌పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌ అభివృద్ధిపై కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ దేశానికే ఎకానమిక్ ఇంజిన్ అని.. ఇలాంటి నగరాన్ని పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. హైదరాబాద్‌ అభివృద్ధి దేశానికే మంచిదని చెప్పారు. అభివృద్ధికి సహకరించాలని కేంద్రానికి, మోదీకి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరని.. ఈ విషయాన్ని తెలుసుకుంటే మంచిదంటూ పేర్కొన్నారు. అభివృద్ధి తాము ఎప్పుడూ ఆకాంక్షిస్తామని.. అవమానించినా అడుగుతూనే ఉంటామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కేంద్రంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం సహకరించడం లేదని కేటీఆర్ ఆరోపించారు. లక్డీకపూల్-BHEL, నాగోల్‌- LBనగర్‌ విస్తరణకు నిధులు కోరామని చెప్పారు. కానీ సరిపడా ప్రయాణికులు లేరంటూ కేంద్రం లేఖ రాసిందన్నారు.యూపీలో 10 నగరాల్లో మెట్రో కడుతున్నారని.. అన్ని చోట్ల కేంద్రమే నిధులు ఇస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కానీ.. హైదరాబాద్‌కు డబ్బులు ఇచ్చే ఉద్దేశం మాత్రం కేంద్రానికి లేదని కేటీఆర్ విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..