Hyderabad: హైదరాబాద్‌లో తొలి WWE ఈవెంట్.. పోటీ పడనున్న 28 మంది ఇంటర్నేషనల్ స్టార్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?
WWE Superstar Spectacle: ఈ ఈవెంట్‌లో ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ సేథ్ 'ఫ్రీకిన్' రోలిన్స్, మహిళల ప్రపంచ ఛాంపియన్ రియా రిప్లే, వివాదరహిత WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్ సమీ జైన్, కెవిన్ ఓవెన్స్‌లతో సహా కీలక WWE సూపర్‌స్టార్స్ హాజరవుతారని ఆయన తెలిపారు. అలాగే WWE సూపర్‌స్టార్లు జిందర్ మహల్, వీర్, సంగ కూడా ఇందులో పోటీపడనున్నారు.
Hyderabad WWE Superstar Spectacle: హైదరాబాద్ క్రీడా అభిమానులకు గుడ్ న్యూస్. సెప్టెంబర్ 8న వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (WWE) ఈవెంట్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. గచ్చిబౌలిలోని GMC బాలయోగి ఇండోర్ స్టేడియం “WWE సూపర్‌స్టార్ స్పెక్టాకిల్” ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ట్విట్టర్‌లో ప్రకటించారు. ఈ మేరకు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి విడుదల చేశారు.
ఈ ఈవెంట్‌లో ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ సేథ్ ‘ఫ్రీకిన్’ రోలిన్స్, మహిళల ప్రపంచ ఛాంపియన్ రియా రిప్లే, వివాదరహిత WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్ సమీ జైన్, కెవిన్ ఓవెన్స్‌లతో సహా కీలక WWE సూపర్‌స్టార్స్ హాజరవుతారని ఆయన తెలిపారు. అలాగే WWE సూపర్‌స్టార్లు జిందర్ మహల్, వీర్, సంగ కూడా ఇందులో పోటీపడనున్నారు. ఈ ఈవెంట్ టిక్కెట్లు www.bookmyshow.comలో అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.
Unveiled the wall poster of 2nd “Superstar Spectacle 2023”, a professional wrestling event produced by the American company WWE.
The event will take place on 8th September at the GMC Balayogi Indoor Stadium in Gachibowli & will feature WWE Superstars in action including: World… pic.twitter.com/iPq7i2fpp6
— V Srinivas Goud (@VSrinivasGoud) August 13, 2023
క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి వైఏటీ అండ్ సి డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ ఆదివారం ఈ ఈవెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు.
Your favourite #WWE Superstars are coming to Hyderabad, #India! Have you bought your #WWESuperstarSpectacle tickets yet?
🎟️: https://t.co/woLwL7JZ50@bookmyshow @WWE @SonySportsNetwk #WWELive #WWEIndia pic.twitter.com/iGcy8xt5pw
— WWE India (@WWEIndia) August 7, 2023
దేశంలోనే రెండోసారి నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌లో అంతర్జాతీయంగా ఖ్యాతి పొందిన 28 మంది డబ్ల్యూడబ్ల్యూఈ క్రీడాకారులు పోటీ పడనున్నట్లు మంత్రి తెలిపారు.
Get your tickets now to watch The King of Claymore Country @DMcIntyreWWE in action at #WWESuperstarSpectacle, LIVE in Hyderabad! (Link in bio) @BookMyShow @WWE @SonySportsNetwk #WWEIndia #WWELive pic.twitter.com/XCBLqdtYVg
— WWE India (@WWEIndia) August 9, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..