Telangana BJP: అస్త్రశస్త్రాలన్నీ సిద్ధం..! చతుర్ముఖ వ్యూహంతో తెలంగాణ బీజేపీ దూకుడు.. అభ్యర్థుల జాబితా ప్రకటన ఎప్పుడంటే..?

Telangana BJP Politics: గులాబీ పార్టీ అధినేత జెట్‌ స్పీడుతో అభ్యర్థులను ప్రకటించారు. తాంబూలాలిచ్చేశాను ఇక తేల్చుకుందాం అంతూ.. సీఎం ప్రతిపక్షాలను సింపుల్‌గా క్రిటికల్‌ జోన్‌లోకి నెట్టేశారు.. అయితే తమకు అంత తొందరేం లేదని ప్రతిపక్షాలు చెబుతున్నా.. బీజేపీ మాత్రం చాలా సైలెంట్‌గా ఇన్‌సైడ్‌ వర్క్ చేస్తోంది.. ప్రత్యేక వ్యూహంతో అధికార పార్టీని అటాక్‌ చేయాలని భావిస్తోంది..

Telangana BJP: అస్త్రశస్త్రాలన్నీ సిద్ధం..! చతుర్ముఖ వ్యూహంతో తెలంగాణ బీజేపీ దూకుడు.. అభ్యర్థుల జాబితా ప్రకటన ఎప్పుడంటే..?
Telangana BJP
Follow us

|

Updated on: Aug 23, 2023 | 9:58 AM

Telangana BJP Politics: గులాబీ పార్టీ అధినేత జెట్‌ స్పీడుతో అభ్యర్థులను ప్రకటించారు. తాంబూలాలిచ్చేశాను ఇక తేల్చుకుందాం అంతూ.. సీఎం ప్రతిపక్షాలను సింపుల్‌గా క్రిటికల్‌ జోన్‌లోకి నెట్టేశారు.. అయితే తమకు అంత తొందరేం లేదని ప్రతిపక్షాలు చెబుతున్నా.. బీజేపీ మాత్రం చాలా సైలెంట్‌గా ఇన్‌సైడ్‌ వర్క్ చేస్తోంది.. ప్రత్యేక వ్యూహంతో అధికార పార్టీని అటాక్‌ చేయాలని భావిస్తోంది.. దీనికి సంబంధించి టీమ్ వర్క్ కూడా మొదలైంది. అటు అధిష్టానం సూచనలతో.. ఇటు ఇక్కడి పరిస్థితులకు తగినట్లు బీజేపీ స్టైల్‌ మార్చింది. ప్రచారంలో సరికొత్త అలజడి సృష్టించాలని కసరత్తులు చేస్తోంది. సోషల్‌ మీడియాను ఉపయోగించుకుంటూ.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసింది. ఇలా చతుర్ముఖ వ్యూహంతో బీజేపీ దూకుడు పెంచింది.

ఆందోళనలు, సభలు, సోషల్ మీడియా ప్రచారం, బూత్ కమిటీల బలోపేతంపై ఒకేసారి దృష్టి పెట్టి చతుర్ముఖ వ్యూహంతో సిద్ధంగా ఉంది బీజేపీ. ఇప్పటికే అధ్యక్షుడి మార్పుతో దూకుడు పెంచేసింది. ఈ నెల 27న ఖమ్మం జిల్లాలో జరిగే అమిత్ షా సభతో గేర్ మార్చాలని డిసైడైంది. తర్వాత ఈనెల 23న చేవెళ్లలో, 24న స్టేషన్ ఘన్ పూర్‌లో సభలకు ప్లాన్ చేసింది బీజేపీ. ఇప్పటికే ప్రజా సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టిన బీజేపీ.. ప్రత్యేక వ్యూహంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. కాగా.. అమిత్ షా సభతో బీజేపీ ఎన్నికల సమరశంఖారావం పూరించనుంది. ఖమ్మం వేదికగా అమిత్ షా పలు కీలక ప్రకటనలు సైతం చేసే అవకాశముందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

తెలంగాణ టూర్‌లో బీజేపి ఎమ్మెల్యేలు.. సెప్టెంబర్ రెండో వారంలో..

ఇప్పటికే మిగతా రాష్ట్రాలనుంచి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.. అభ్యర్థుల ఎంపికలో వీళ్లిచ్చే రిపోర్టులు కూడా కీలకం కాబోతున్నాయట. ఇప్పటికే సీనియర్లంతా అసెంబ్లీలకు పోటీ చేయాలని అధిష్టానం నుంచి ఆదేశాలొచ్చేశాయ్. నెలాఖర్లోగా తొలి జాబితా ప్రకటించి.. నేతల్లో కాన్ఫిడెన్స్ పెంచాలని కమలనాథుల ఆలోచించారు. అయితే, సెప్టెంబర్ రెండో వారంలో తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధిష్టానం ప్రకటిస్తుందని టీబీజేపీ నేతలు క్లారిటీ ఇచ్చారు. . దాని ప్రకారం.. అధిష్టానం సలహాలు సూచనలతో తెలంగాణ కమలనాథులు అడుగులేస్తున్నారు. కేసీఆర్‌ను ఎదుర్కొవాలంటే. అధికార పార్టీకి చుక్కలు చూపించాలంటే.. ఆచి తూచి అడుగేయ్యాలి.. ఎన్నో వ్యూహాలు రచించాలి.. పక్కాగా అమలు చేయాలని.. బీజేపీ తెలంగాణ చీఫ్‌ కిషన్ రెడ్డి భావిస్తున్నారట.. అయితే దానికోసం బ్యాక్‌‌గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించారని సమాచారం..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..