Telangana: హైవేపై ఘోర ప్రమాదం.. నలుగురి ప్రాణం తీసిన లారీ.. తేనె అమ్ముకునేందుకు వస్తుండగా..

వాళ్లంతా తేనెను సేకరించి విక్రయాలు జరుపుతుంటారు.. అదే వారికి జీవనాధారం.. ఎప్పటిలానే అటవీ ప్రాంతంలో తేనె సేకరించి అమ్ముకునేందుకు పట్టణానికి ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చి.. అందరినీ కబళించింది. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు.

Telangana: హైవేపై ఘోర ప్రమాదం.. నలుగురి ప్రాణం తీసిన లారీ.. తేనె అమ్ముకునేందుకు వస్తుండగా..
Road Accident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 16, 2023 | 8:26 AM

వరంగల్, ఆగస్టు 16: వాళ్లంతా తేనెను సేకరించి విక్రయాలు జరుపుతుంటారు.. అదే వారికి జీవనాధారం.. ఎప్పటిలానే అటవీ ప్రాంతంలో తేనె సేకరించి అమ్ముకునేందుకు పట్టణానికి ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చి.. అందరినీ కబళించింది. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం వద్ద చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై అతివేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ సహా నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జైంది.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు అంతా తేనె విక్రయాలు జరుపుకునే వారని పోలీసులు తెలిపారు. ఆటోలో తేనె తీసుకొని వరంగల్ కు వస్తుండగా అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టిందని.. అక్కడికక్కడే నలుగురు మృతిచెందినట్లు తెలిపారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

రాజస్థాన్ చెందిన లారీ డ్రైవర్ మద్యం, నిద్ర మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని పేర్కొంటున్నారు. నిద్రమత్తులో డ్రైవర్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతోనే దినసరి కులీలు మరణించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

గజ్వేల్‌లోనూ ఘోర ప్రమాదం..

మంగళవారం గజ్వేల్‌లోనూ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తుర్కపల్లి దగ్గర బస్సు – లారీ ఢొకొన్నాయి. ఈ ఘటనలో కండక్టర్ స్పాట్లో మరణించారు. కండక్టర్ సాకలి బాల నర్సయ్య గా గుర్తించారు. ఆ ఘటన అనంతరం మృతదేహాన్ని పోలీసులు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..