WhatsApp New Feature: స్పామ్ కాల్స్‌కి ఇక చెక్.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మీ ప్రైవసీ మరింత భద్రం..

దీనికితోడు తెలియని నంబర్ల నుంచి ఫోన్లు, మెసేజ్ లతో వినియోగదారులు విసిగిపోతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఓ కొత్త అప్ డేట్ ను తీసుకొచ్చింది. సైలెన్స్ అన్ నోన్ కాలర్స్ పేరిట దీనిని ప్రవేశపెట్టింది.

WhatsApp New Feature: స్పామ్ కాల్స్‌కి ఇక చెక్.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మీ ప్రైవసీ మరింత భద్రం..
Whatsapp
Follow us

|

Updated on: Jun 29, 2023 | 10:15 AM

ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు డేటా భద్రత. స్మార్ట్ ఫోన్లలోని యాప్ లలో వినియోగదారుల డేటా మొత్తం ఉంటుడంతో దానిని కాపాడటం పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. దీనికితోడు తెలియని నంబర్ల నుంచి ఫోన్లు, మెసేజ్ లతో వినియోగదారులు విసిగిపోతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఓ కొత్త అప్ డేట్ ను తీసుకొచ్చింది. సైలెన్స్ అన్ నోన్ కాలర్స్ పేరిట దీనిని ప్రవేశపెట్టింది. దీని ద్వారా స్పామ్ కాల్స్, తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్లను అరికట్టవచ్చని వాట్సాప్ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ప్రైవసీకి వాట్సాప్ అధిక ప్రాధాన్యం..

వాట్సాప్ వినియోగదారుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే అనేక రకాల కొత్త ఫీచర్లు, అప్ డేట్లను వాట్సాప్ తీసుకొచ్చింది. వినియోగదారుల కాల్స్, మెసేజ్ లు భద్రంగా ఉండేందుకు ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి సైలెన్స్ అన్ నోన్ కాలర్స్ ఫీచర్ ను తీసుకొచ్చింది. దీని ద్వారా మీకు వచ్చే కాల్స్ పై మరింత కంట్రోల్ మీకు లభిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా మీరు స్పామ్ కాల్స్, స్కామ్ కాల్స్, తెలియని వారి నుంచి వచ్చే కాల్స్ నుంచి మిమ్మల్ని హైడ్ చేస్తుంది. అయితే ఈ కాల్స్ లిస్ట్ మాత్రం మీకు మీ కాల్ లిస్ట్ లో చూపిస్తుంది. కాల్ వచ్చినప్పుడు మాత్రం అవి సైలెంట్ అయిపోతాయి. అసలు కాల్ వచ్చినట్టు కూడా మీకు తెలియదు. కాల్ వచ్చినప్పుడు రింగ్ కూడా రాదు. ఒకవేళ మీకు తెలిసిన వారిది అయితే కాల్ లిస్ట్ ఉంటుంది కాబట్టి తిరిగి కాల్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ను యాక్టివేట్ చేయడానికి మీరు వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ప్రైవసీ సెట్టింగ్స్ ఓపెన్ చేసి యాక్టివేట్ చేయొచ్చు.

వాట్సాప్ ప్రైవసీ చెక్ ఫీచర్..

ఇదే కాక వాట్సాప్ లో కొత్త ప్రైవసీ చెక్ ఫీచర్ కూడా ఉంది. ఇది మీ చాట్స్, కాల్స్, పర్సనల్ సమాచారాన్ని భద్రపరుస్తుంది. దీనిని యాక్టివేట్ చేసుకునేందుకు ముందుగా వాట్సాప్ లోకి వెళ్లి దానిలో సెట్టింగ్స్ ఓపెన్ చేసి, ప్రైవసీ సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. దానిలో న్యూ ప్రైవసీ చెక్ అప్ ప్రాంప్ట్ మీకు కనిపిస్తుంది. ఇది మీకూ మరో భద్రతా లేయర్ కింద పనిచేస్తుంది. ఇది మిమ్మల్ని ఎవరూ కాంటాక్ట్ అవ్వాలి. ఎవరు అవ్వకూడదు. అనే విషయాలను తెలియజేయాలని అడుగుతుంది. మీ వ్యక్తి సమాచారం, డిసప్పియరింగ్ మెసెజెస్, స్రీన్ లాకింగ్ యాప్ వంటివి అన్ని మీరు ముందుగానే నిర్ధేశించుకొవచ్చు. అలాగే మీరు మాత్రమే వాటిని చూసే వీలును కల్పిస్తుంది. అందుకోసం మీరు ప్రైవసీ సెట్టింగ్స్ లో ప్రైవసీ చెక్ అప్ ఆప్షన్ పై క్లిక్ చేసి, స్టార్ట్ చెకపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ‘చూజ్‌ కెన్‌ కాంటాక్ట్‌ యూ’ పై క్లిక్ చేయాలి. దాని వద్దే సైలెన్స్ అన్ నోన్ కాలర్ ఆప్షన్ కూడా ఆన్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..