Asteroid: ఆకాశంలో అద్భుతం.. అదే జరిగితే ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ బిలియనీర్ అవ్వొచ్చు..!

Psyche 16: ధనవంతులు కావాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ డబ్బు కోసం ఉరుకులు పరుగులు తీస్తారు. డబ్బులు సంపాదించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో.. అన్ని ప్రయత్నాలు చేస్తారు.

Asteroid: ఆకాశంలో అద్భుతం.. అదే జరిగితే ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ బిలియనీర్ అవ్వొచ్చు..!
Billionaire
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 22, 2023 | 12:57 PM

Psyche 16: ధనవంతులు కావాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ డబ్బు కోసం ఉరుకులు పరుగులు తీస్తారు. డబ్బులు సంపాదించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో.. అన్ని ప్రయత్నాలు చేస్తారు. కానీ, అందరూ ధనవంతులు కాలేరు. డబ్బు సంపాదించే క్రమంలో ఎందరో తమ జీవితాలను సైతం కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా ఇలా ఉంటే.. యావంత్ ప్రపంచంలోని ప్రజలు ఒక్కసారిగా బిలియనీర్లుగా మారితే ఎలా ఉంటుంది? మరి ఇది సాధ్యమేనా? ఇంట్రస్టింగ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం..

అంతరిక్షంలో ఒక ఉల్క ఉంది. ఇది విలువైన లోహాలతో నిండి ఉంది. ఇప్పుడు ఈ ఉల్కపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఉల్క భూమిపైకి వస్తే, దానిలోని లోహాలకు ఉన్న విలువ కారణంగా ప్రతి వ్యక్తి బిలియనీర్ అవ్వొచ్చని చెబుతున్నారు పరిశోధకులు. కాగా, 1852లోనే కనుగొన్న ఈ ఉల్కకి సైక్ 16 అని పేరు పెట్టారు.

విలువైన లోహాలతో నిండి ఉన్న ఉల్క..

ఈ ఉల్కపై పరిశోధనలు చేసేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. అయితే, దీనిపై పరిశోధన అంత ఈజీగా కాదు. కారణం.. ఇది భూమి నుంచి చాలా దూరంలో ఉంది. భూమి నుంచి సైక్ 16 మధ్య దూరం 300 మిలియన్ మైళ్లు ఉంది. లాడ్‌బైబిల్ నివేదిక ప్రకారం.. ఈ గ్రహశకలం ఇనుము, నికెల్, బంగారంతో నిండి ఉంది. భూమిపై ధర 10,000 క్విన్టిలియన్ డాలర్లు.

ఇవి కూడా చదవండి

సైక్ 16పై పరిశోధనల కోసం నాసా ప్రయోగం..

ఈ సైక్ 16పై పరిశోధనల కోసం అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా ప్రత్యేక అంతరిక్ష నౌకను సిద్ధం చేసింది. ఈ ఏడాది అక్టో్బర్ 5న ఈ ప్రయోగం చేయనున్నట్లు సమాచారం అందుతోంది. అయితే, ఈ ఉల్కపై పరిశోధనలు మాత్రమే చేస్తారని, దాని విలువైన లోహాల కోసం కాదని నాసా చెబుతోంది. ఈ పరిశోధన ద్వారా సైక్ 16 వంటి మరిన్ని గ్రహ శకలాలను అర్థం చేసుకోవడానికి వీలు పడుతుందని చెబుతున్నారు పరిశోధకులు.

మరిన్ని సైన్స్&టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..