Android: కొత్త లుక్‌లో ఆండ్రాయిడ్ లోగో.. ఇదే గూగుల్ ‘న్యూ బ్రాండ్ ఐడెంటిటీ’.. పూర్తి వివరాలు

ఆకుపచ్చ రంగులో చిన్న రోబో మాదిరిగా ఉండే ఈ ఆకారం చాలా ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, ఆన్ చేసినప్పుడు, లేదా సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేసినప్పుడు ఈ ఆండ్రాయిడ్ లోగో మీకు కనిపిస్తుంది. ఇప్పుడు దీనిని గూగుల్ అప్ డేట్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

Android: కొత్త లుక్‌లో ఆండ్రాయిడ్ లోగో.. ఇదే గూగుల్ ‘న్యూ బ్రాండ్ ఐడెంటిటీ’.. పూర్తి వివరాలు
Android Logo
Follow us
Madhu

|

Updated on: Jun 29, 2023 | 10:00 AM

ఆండ్రాయిడ్.. స్మార్ట్ ఫోన్ల దిశ దశ చూపిన సాఫ్ట్ వేర్. ఈ ఆండ్రాయిడ్ రాకతో ఫోన్ల ముఖ చిత్రమే మారిపోయింది. రకరకాల ఫీచర్లు, వినియోగదారులను ఆకర్షించేలా అత్యద్భుత అప్ డేట్లు ఆండ్రాయిడ్ తీసుకొచ్చింది. గూగుల్ ద్వారా ఆవిష్కృతమైన ఈ ఆండ్రాయిడ్ ఆధారంగా ప్రస్తుతం ఉన్న స్మార్ట్ ఫోన్లు పనిచేస్తున్నాయి. అయితే చాలా మందికి ఈ ఆండ్రాయిడ్ కి కూడా ఓ లోగో ఉందని తెలీదు. ప్రతి ఒక్కరి ఫోన్లోనూ ఈ లోగో కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగులో చిన్న రోబో మాదిరిగా ఉండే ఈ ఆకారం చాలా ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, ఆన్ చేసినప్పుడు, లేదా సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేసినప్పుడు ఈ ఆండ్రాయిడ్ లోగో మీకు కనిపిస్తుంది. ఇప్పుడు దీనిని గూగుల్ అప్ డేట్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కొత్త లోగోను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న లోగో స్థానంలో 3డీ లోగోను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ లోగోలో రోబో హెడ్ తో పాటు వర్డ్ మార్క్ ను మార్చనుంది. అంటే ఆండ్రాయిడ్ అనే ఇంగ్లిష్ అక్షరాలలో మార్పులు చేయనుంది. ఆ మార్పులేంటో చూద్దాం..

మార్పులు ఇవే..

కొన్ని సోర్సుల ప్రకారం ఆండ్రాయిడ్ లోగోలో గూగుల్ మార్పులు చేస్తోంది. ఈ విషయాన్ని గూగుల్ సంస్థ కూడా నిర్ధారించినట్లు తెలుస్తోంది. లోగోలో ఉండే రోబో హెడ్ మార్పులతో పాటు ఆండ్రాయిడ్ అనే ఇంగ్లిష్ అక్షరాలను కూడా మార్చుతోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ అనే పేరు ఇంగ్లిష్ అక్షరాలలో ఉంటుంది. ఇది ‘ఏ’ అనే అక్షరం క్యాపిటల్ లెటర్ లో ఉంటుంది. దీనిని ఇప్పుడు మార్చుతున్నారు. స్మాల్ లెటర్లలోనే తీసుకొస్తున్నారు. అలాగే మధ్యలో ఉండే లెటర్లు ‘ఎన్’ ,‘ఆర్’ అక్షరాలు కూడా వ‌ృత్తాకారంలో ఉండేట్లు చూస్తున్నారు. అంటే 2014, 2008 మోడళ్లలో దీనిని కొత్తగా రీడిజైన్ చేస్తున్నారు.

రోబో హెడ్ విషయానికి వస్తే ప్రస్తుతం అది ఫ్లాట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది 3డీ వెర్షన్ లోకి అప్ డేట్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఐ/ఓ 2023లోనే ప్రదర్శించినట్లు కొత్త సోర్సుల ప్రకారం తెలుస్తోంది.

ఆ ఫోన్లలో ప్రత్యక్షం..

అప్ గ్రేడ్ అయిన ఆండ్రాయిడ్ లోగోలోని కొత్త 3డీ రోబో హెడ్, నూతన ఫాంట్స్ తొలుత శామ్ సంగ్ డివైజెస్ లోని ఫస్ట్ పార్టీ యాప్ లలో దర్శనమివ్వనున్నాయి. ప్రత్యేకంగా గేలాక్సీ ఎస్23 అల్ట్రా, గేలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 ఫోన్లలో ఇది కనిపించనుంది.

ధ్రువీకరించిన గూగుల్..

ఆండ్రాయిడ్ కొత్త లోగో గురించి గూగుల్ ఆండ్రాయిడ్ కూడా ధ్రువీకరించింది. గూగుల్ సీఈఎస్ బూత్, డిజిటల్. బ్యానర్ ప్రకటనల వంటి వివిధ ప్రచార ప్లాట్‌ఫారమ్‌లలో దీనిని ప్రదర్శిస్తున్నట్లు పేర్కొంది. ‘న్యూ బ్రాండ్ ఐడెంటిటీ’ కింద వీటిని ప్రదర్శిస్తోంది. రానున్న కాలంలో మరిన్ని అప్‌డేట్‌లుతో పాటు కొత్త సమాచారం వెల్లడి చేసే అవకాశం ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..