UWW vs WFI: ఇండియన్ రెజ్లింగ్ అసోసియేషన్ సభ్యత్వం రద్దు.. వరల్డ్ రెజ్లింగ్‌లో భారీ దెబ్బ..

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలపై అస్సాం హైకోర్టు స్టే విధించింది. ముందుగా జూలై 11న ఎన్నికలు జరగాల్సి ఉండగా.. అస్సాం రెజ్లింగ్ సంఘం గుర్తింపుపై కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన అస్సాం హైకోర్టు ఎన్నికలపై స్టే విధించింది. ఆ తర్వాత ఆగస్టులో కూడా ఎన్నికలు నిర్వహించలేకపోయారు. ఇదిలావుంటే, బ్రిజ్‌భూషణ్ శరణ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆఫీస్ బేరర్లను సస్పెండ్ చేస్తూ క్రీడా మంత్రిత్వ శాఖ ఏడీహెచ్ఓసీ కమిటీని ఏర్పాటు చేసింది.

UWW vs WFI: ఇండియన్ రెజ్లింగ్ అసోసియేషన్ సభ్యత్వం రద్దు.. వరల్డ్ రెజ్లింగ్‌లో భారీ దెబ్బ..
WFI Suspended
Follow us

|

Updated on: Aug 24, 2023 | 3:12 PM

ఇండియన్ రెజ్లర్లకు భారీ దెబ్బ తగిలింది.  రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యత్వాన్ని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ రద్దు చేసింది. 45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించలేకపోవడంతో డబ్ల్యూఎఫ్‌ఐ సభ్యత్వం రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇండియన్ రెజ్లింగ్ అసోసియేషన్ ఎన్నికలు ఆగస్టు 12న జరగాల్సి ఉండగా.. ఓటింగ్‌కు ఒకరోజు ముందు పంజాబ్-హర్యానా హైకోర్టు ఎన్నికలపై స్టే విధించింది. గతంలో వరల్డ్ రెజ్లింగ్ 45 రోజుల లోపు ఎన్నికలు నిర్వహించాలని భారత రెజ్లింగ్ సమాఖ్యను కోరగా.. చాలా కాలం తర్వాత కూడా ఎన్నికలు నిర్వహించలేకపోయారు. వరల్డ్ రెజ్లింగ్ చర్య తీసుకుంటూనే భారత రెజ్లింగ్‌ను సస్పెండ్ చేసింది.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలపై అస్సాం హైకోర్టు స్టే విధించింది. ముందుగా జూలై 11న ఎన్నికలు జరగాల్సి ఉండగా.. అస్సాం రెజ్లింగ్ సంఘం గుర్తింపుపై కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన అస్సాం హైకోర్టు ఎన్నికలపై స్టే విధించింది. ఆ తర్వాత ఆగస్టులో కూడా ఎన్నికలు నిర్వహించలేకపోయారు.

ఇదిలావుంటే, బ్రిజ్‌భూషణ్ శరణ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆఫీస్ బేరర్లను సస్పెండ్ చేస్తూ క్రీడా మంత్రిత్వ శాఖ ఏడీహెచ్ఓసీ కమిటీని ఏర్పాటు చేసింది. జమ్ముకశ్మీర్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎంఎం కుమార్ రెజ్లింగ్ సమాఖ్య కొత్త ఎన్నికలకు ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు.

భారతీయ రెజ్లింగ్‌లో రచ్చ

గత కొన్ని నెలలుగా భారత రెజ్లింగ్‌లో రచ్చ జరుగుతోంది. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా చాలా మంది రెజ్లర్లు అప్పటి అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణలకు  పాల్పడ్డారు. రెజ్లర్లు చాలా రోజులపాటు నిరసనలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత క్రీడా మంత్రిత్వ శాఖ ఫెడరేషన్ ఆఫీస్ బేరర్లను సస్పెండ్ చేసింది. ఆఫీస్ బేరర్లను సస్పెండ్ చేసిన తర్వాత.. అడహాక్ కమిటీ ఫెడరేషన్ పనిని నిర్వహిస్తోంది.

రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసు పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. రెజ్లింగ్ ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సాక్షిమాలిక్‌తో మరో రెజ్లర్‌ బబితా ఫోగట్‌ వెనుక కాంగ్రెస్ ఉందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ ఆరోపణలను వారు ఖండించారు. జంతర్‌మంతర్‌ దగ్గర తమ ఆందోళనల వెనుక కాంగ్రెస్‌ పార్టీ హస్తముందన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు సాక్షిమాలిక్‌.

సంజయ్ సింగ్ గురించి రచ్చ..

గతంలో ఫెడరేషన్‌కు ఆగస్టు 12న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అధ్యక్ష పదవికి నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఓ మహిళ నామినేషన్ దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి నామినేషన్‌ దాఖలు చేసిన సంజయ్‌ సింగ్‌పై పెద్ద దుమారమే రేగింది. సంజయ్‌ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌కు సన్నిహితుడని ఆరోపణలు చేశారు. సంజయ్ సింగ్ ఎన్నికల బరిలోకి దిగడంపై మల్లయోధులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. సంజయ్ సింగ్ ఏకైక మహిళా అభ్యర్థి, మాజీ రెజ్లర్ అనితా షియోరాన్‌కు మద్దతు ఇచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం