Sania Mirza – Shoaib Malik: సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడిపోతున్నారా.. ప్రూఫ్ ఇదిగో..
Sania Mirza - Shoaib Malik Divorce: షోయబ్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోను మార్చాడంతో వీరద్దరి విడాకుల వార్త మరోసారి తెరమీదికి వచ్చింది. ఇదివరకు ‘సూపర్ ఉమెన్ సానియా మీర్జా’ అని బయోలో ఉండగా.. ఈ వ్యాఖ్యలను కట్ చేశారు. ఆ తర్వాత ఉన్న తాజాగా ఆయన ఇప్పుడు ‘ప్రో అథ్లెట్ – లైవ్ అన్‌బ్రోకెన్’ అని మాత్రమే ఉంచుకున్నారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్, సోనియా భర్త షోయబ్ మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో ‘ప్రో అథ్లెట్ – లైవ్ అన్‌బ్రోకెన్’తో పాటుగా ‘ఓ బిడ్డకు తండ్రిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది’ అని కూడా రాసుకొచ్చారు.
ఇండియన్ టెన్నిస్ మాజీ ప్లేయర్ సానియా మిర్జా, పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ల విడాకుల వ్యవహారం మరోసారి వార్తల్లో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకుంటునున్నారంటూ సోషల్ మీడియా సోది (జరగబోయేది)చెబుతోంది. ఈ ఊహాగానాలకు కారణం కూడా ఉంది. తాజాగా షోయబ్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోను మార్చాడంతో వీరద్దరి విడాకుల వార్త మరోసారి తెరమీదికి వచ్చింది. ఇదివరకు ‘సూపర్ ఉమెన్ సానియా మీర్జా’ అని బయోలో ఉండగా.. ఈ వ్యాఖ్యలను కట్ చేశారు. ఆ తర్వాత ఉన్న తాజాగా ఆయన ఇప్పుడు ‘ప్రో అథ్లెట్ – లైవ్ అన్‌బ్రోకెన్’ అని మాత్రమే ఉంచుకున్నారు.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్, సోనియా భర్త షోయబ్ మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో ‘ప్రో అథ్లెట్ – లైవ్ అన్‌బ్రోకెన్’తో పాటుగా ‘ఓ బిడ్డకు తండ్రిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది’ అని కూడా రాసుకొచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బయో పిక్ సోషల్ మీడియాను కుదిపేస్తోంది. దీంతో షోయబ్ మాలిక్, సానియా విడిపోతున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియా కామెంట్స్‌పై ఇప్పటి వరకు అటు సానియా.. ఇటు షోయబ్ ఎలాంటి కామెంట్ చేయలేదు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే వారి స్పందన కోసం ఆగాల్సిందే.
కొవిడ్ తర్వాత అంటే గతేడాది నుంచే మాలిక్, సానియాల లైఫ్ సాఫీగా సాగడం లేదనివార్తలు చక్కర్లు కొట్టాయి. ఇందుకు కారణం పాకిస్తానీ నటి అయేషా ఉమర్‌తో మాలిక్ ఎఫైర్.. దీనికి తోడు వారిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో రావడం ఇందుకు కారణంగా మారింది. కొన్నాళ్ల క్రితం మాలిక్‌కు అయేషాతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందట.
మరిన్ని క్రీడా వార్తల కోసం