AFC Asian Cup 2023: ఏఎఫ్‌సీ ఆసియా కప్ ప్రారంభ, ఫైనల్ మ్యాచ్ జరిగేది అక్కడే..

AFC Asian Cup Qatar 2023: జనవరి-ఫిబ్రవరి 2024లో జరిగే AFC ఆసియా కప్‌లో 24 జట్లు పాల్గొంటాయి. ఈ జట్లను ఆరు గ్రూపులుగా విభజించి గ్రూప్ దశలో ప్రతిరోజూ మూడు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ప్రతి గ్రూప్ నుంచి మొదటి రెండు జట్లతోపాటు, మూడు, నాలుగుస్థానంలో నిలిచిన జట్లు రౌండ్ ఆఫ్ సిక్స్‌టీన్‌కి చేరుకుంటాయి.

AFC Asian Cup 2023: ఏఎఫ్‌సీ ఆసియా కప్ ప్రారంభ, ఫైనల్ మ్యాచ్ జరిగేది అక్కడే..
Afc Asian Cup
Follow us
Venkata Chari

|

Updated on: Aug 22, 2023 | 2:00 PM

AFC Asian Cup Qatar 2023: లూసైల్ స్టేడియం.. ఖతార్‌లోనే అందమైన స్టేడియం. అయితే, ఈ స్టేడింయ ప్రపంచ కప్ కంటే ముందే ఎక్కువ ప్రజాదరణ పొందింది. ఈ స్టేడియంలో లియోనెల్ మెస్సీ చరిత్ర సృష్టించాడు. ఫ్రాన్స్‌ను ఓడించి లియోనెల్ మెస్సీ ప్రపంచకప్ విజయాన్ని రుచి చూశాడు. ఈసారి ఆ స్టేడియంలో ఏఎఫ్‌సీ ఆసియా కప్‌ ప్రారంభ మ్యాచ్‌ జరగనుంది. అదొక్కటే కాదు.. ఈ టోర్నీ ఫైనల్ కూడా లుసైల్ స్టేడియంలోనే జరగనుంది . ఈ విషయాన్ని ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్, AFC ఆసియా కప్ ఖతార్ స్థానిక ఆర్గనైజింగ్ కమిటీ ధృవీకరించాయి.

AFC ఆసియా కప్ ఖతార్‌లో జరగడం ఇదే మొదటిసారి కాదు. ఖతార్ గతంలో 1988, 2011లో AFC ఆసియా కప్‌ను నిర్వహించింది. ఈ టోర్నీకి ఖతార్ మూడోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. జనవరి 12, 2024న AFC ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్‌లో, చివరిసారి ఛాంపియన్‌లైన ఖతార్ వర్సెస్ లెబనాన్‌లు తలపడనున్నాయి. ఆ మ్యాచ్ లుసైల్ స్టేడియంలో జరగనుంది. దీంతో పాటు టోర్నీ ఫైనల్ మ్యాచ్ కూడా ఫిబ్రవరి 10న ఇక్కడ జరగనుంది.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్ స్టేడియాలు..

ఈ ఏడాది AFC ఆసియా కప్‌లో లుసైల్ స్టేడియం అతిపెద్ద వేదికగా నిలిచింది. ఈ స్టేడియంలో ప్రేక్షకుల సంఖ్య 88 వేలు. 2022 ఖతార్ ప్రపంచ కప్‌లో మొత్తం 10 మ్యాచ్‌లు ఈ అందమైన లుసైల్ స్టేడియంలో జరిగాయి. ఈ అందమైన స్టేడియం ఖతార్ ఆశయాలను, అరబ్ సంస్కృతిని ప్రదర్శిస్తుంది.

ఎఎఫ్సీ ఆసియాకప్ వివరాలు..

2024 జనవరి-ఫిబ్రవరిలో జరిగే AFC ఆసియా కప్‌లో 24 జట్లు పాల్గొంటాయి. ఈ జట్లను ఆరు గ్రూపులుగా విభజించి గ్రూప్ దశలో ప్రతిరోజూ మూడు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ప్రతి గ్రూప్ నుంచి మొదటి రెండు జట్లతోపాటు, మూడు, నాలుగుస్థానంలో నిలిచిన జట్లు రౌండ్ ఆఫ్ సిక్స్‌టీన్‌కి చేరుకుంటాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..