Ind vs Pak: మరోసారి ఆసక్తికర పోరు.. రేపు భారత్ చేరుకోనున్న పాకిస్తాన్ జట్టు.. ఆగస్ట్ 3 నుంచి ఆసియా ఛాంపియన్స్..
Asian Champions Trophy 2023: ఆగస్టు 3 నుంచి చెన్నైలో జరగనున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్‌కు వెళ్లేందుకు పాకిస్థాన్ హాకీ జట్టుకు అనుమతి లభించింది. పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ (PHK) సెక్రటరీ హైదర్ హుస్సేన్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) అందుకున్నట్లు ధృవీకరించారు.
Asian Champions Trophy 2023: ఆగస్టు 3 నుంచి చెన్నైలో జరగనున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్‌కు వెళ్లేందుకు పాకిస్థాన్ హాకీ జట్టుకు అనుమతి లభించింది. పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ (PHK) సెక్రటరీ హైదర్ హుస్సేన్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) అందుకున్నట్లు ధృవీకరించారు. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ సహా మొత్తం 6 జట్లు పాల్గొంటాయి. జపాన్, చైనా, మలేషియా, దక్షిణ కొరియా కూడా ఇందులో పాల్గొంటాయి.
రేపు భారత్ చేరుకోనున్న పాకిస్థాన్ జట్టు..
పాకిస్థాన్ హాకీ సెక్రటరీ హైదర్ హుస్సేన్ మాట్లాడుతూ.. ‘పాకిస్థానీ జట్టు మంగళవారం వాఘా సరిహద్దు నుంచి అమృత్‌సర్‌కు వెళ్లి, అక్కడి నుంచి దేశీయ విమానంలో చెన్నై చేరుకుంటుంది. ముగ్గురు అధికారులు వీసాల కోసం ఎదురు చూస్తున్నట్లు హైదర్ తెలిపారు. వీరిలో కొత్తగా జాతీయ జట్టుకు సలహాదారుగా నియమితులైన షహనాజ్ షేక్ కూడా ఉన్నారు. సోమవారం నాటికి వీసా వస్తుందన్న నమ్మకం ఉందని హైదర్ తెలిపారు. మిగతా ఆటగాళ్లు, అధికారులకు భారత హైకమిషన్ ఇప్పటికే వీసాలు జారీ చేసింది. ఆగస్టు 3న మలేషియాతో పాకిస్థాన్ తొలి మ్యాచ్ ఆడనుంది.
పాకిస్థాన్ జట్టు..
ముహమ్మద్ ఉమర్ భట్టా (కెప్టెన్), అక్మల్ హుస్సేన్, అబ్దుల్లా ఇస్తియాక్ ఖాన్, ముహమ్మద్ అబ్దుల్లా, ముహమ్మద్ సుఫియాన్ ఖాన్, ఎహత్షామ్ అస్లాం, ఒసామా బషీర్, అకీల్ అహ్మద్, అర్షద్ లియాఖత్, ముహమ్మద్ ఇమాద్, అబ్దుల్ హనన్ షాహిద్, జకారియా హయత్, రానా అబ్దుల్ వహీద్ అష్రఫ్ (వైస్- కెప్టెన్) ), రోమన్, ముహమ్మద్ ముర్తజా యాకూబ్, ముహమ్మద్ షాజెబ్ ఖాన్, అఫ్రాజ్, అబ్దుల్ రెహమాన్.
స్టాండ్‌బై: అలీ రజా, ముహమ్మద్ బాకీర్, ముహమ్మద్ నదీమ్ ఖాన్, అబ్దుల్ వహాబ్, వకార్ అలీ, ముహమ్మద్ అర్సలాన్ మరియు అబ్దుల్ ఖయ్యూమ్.
భారత హాకీ జట్టు-
గోల్ కీపర్లు: పీఆర్ శ్రీజేష్, కృష్ణ బహదూర్ పాఠక్
డిఫెండర్లు: జర్మన్‌ప్రీత్ సింగ్, సుమిత్, జుగ్రాజ్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), వరుణ్ కుమార్, అమిత్ రోహిదాస్
మిడ్‌ఫీల్డర్లు: హార్దిక్ సింగ్ (వైస్ కెప్టెన్), వివేక్ సాగర్ ప్రసాద్, మన్‌ప్రీత్ సింగ్, నీలకంఠ శర్మ, షంషేర్మ సింగ్
ఫార్వర్డ్స్: ఆకాశ్‌దీప్ సింగ్, మన్‌దీప్ సింగ్, గుర్జంత్ సింగ్, సుఖ్‌జీత్ సింగ్, ఎస్ కార్తీ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..