Dutee Chand Banned: భారత్‌కు బిగ్ షాక్.. అథ్లెట్ ద్యుతీ చంద్‌పై 4 సంవత్సరాల నిషేధం.. ఎందుకంటే?

Dope Test: ఆసియా క్రీడలు 2018లో ద్యుతీ 100 మీటర్లు, 200 మీటర్లలో రెండు స్వర్ణ పతకాలను గెలుచుకుంది. 'ది బ్రిడ్జ్'లో ప్రచురించిన వార్తల ప్రకారం, నాడా అధికారులు గత సంవత్సరం ద్యుతీ నమూనాను తీసుకున్నారు. ఇందులో భాగంగా మొదటి నమూనాలో ఆండారిన్, ఆస్టారిన్, లింగండ్రోల్ కనుగొన్నారు. రెండవ నమూనాలో ఆండారిన్, ఓస్టారిన్ కనుగొన్నారు. ద్యుతీకి బి శాంపిల్ టెస్ట్ ఇచ్చే అవకాశం వచ్చింది. ఇందుకోసం ఆమెకు 7 రోజుల సమయం ఇచ్చారు. కానీ ద్యుతీ టెస్టులకు హాజరుకాలేదు.

Dutee Chand Banned: భారత్‌కు బిగ్ షాక్.. అథ్లెట్ ద్యుతీ చంద్‌పై 4 సంవత్సరాల నిషేధం.. ఎందుకంటే?
Dutee Chand Banned
Follow us
Venkata Chari

|

Updated on: Aug 18, 2023 | 12:49 PM

Dutee Chand Banned After Dope Test: భారత అథ్లెట్ ద్యుతీ చంద్ 4 సంవత్సరాల నిషేధానికి గురైంది. డోపింగ్ కారణంగా ఆమెపై నిషేధం విధించారు. ఈ మేరకు ఆమెకు డోపింగ్ టెస్టులు నిర్వహించారు. అందులో సెలెక్టివ్ ఆండ్రోజెన్ రిసెప్టర్ మాడ్యులేటర్లు (SARMs) కనుగొన్నారు. ద్యుతిపై విధించిన నాలుగేళ్ల నిషేధం జనవరి 2023 నుంచి పరిగణించనున్నారు. 2021లో గ్రాండ్ ప్రిక్స్‌లో 100 మీటర్ల రేసును 11.17 సెకన్లలో పూర్తి చేసి జాతీయ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ద్యుతీ చాలా మ్యాచ్‌లలో సత్తా చాటింది.

ఆసియా క్రీడలు 2018లో ద్యుతీ 100 మీటర్లు, 200 మీటర్లలో రెండు స్వర్ణ పతకాలను గెలుచుకుంది. ‘ది బ్రిడ్జ్’లో ప్రచురించిన వార్తల ప్రకారం, నాడా అధికారులు గత సంవత్సరం ద్యుతీ నమూనాను తీసుకున్నారు. ఇందులో భాగంగా మొదటి నమూనాలో ఆండారిన్, ఆస్టారిన్, లింగండ్రోల్ కనుగొన్నారు. రెండవ నమూనాలో ఆండారిన్, ఓస్టారిన్ కనుగొన్నారు. ద్యుతీకి బి శాంపిల్ టెస్ట్ ఇచ్చే అవకాశం వచ్చింది. ఇందుకోసం ఆమెకు 7 రోజుల సమయం ఇచ్చారు. కానీ ద్యుతీ టెస్టులకు హాజరుకాలేదు.

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది జనవరిలో ద్యుతీని నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) సస్పెండ్ చేసింది. ఈ కారణంగా, ఆమె ఇప్పటివరకు అన్ని పోటీల నుంచి నిష్క్రమించింది. ఆమె ప్రస్తుతం జాతీయ శిబిరంలో భాగం కావడం లేదు. ద్యుతీకి డోపింగ్ టెస్ట్ 5 డిసెంబర్ 2022న భువనేశ్వర్‌లో జరిగింది.

ద్యుతీ చంద్..

ద్యుతీ చంద్ ప్రాక్టీస్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..