Street Car Racing: ఫార్ములా-4 కార్ రేసింగ్ పోటీలు.. దక్షిణాసియాలో తొలిసారిగా..!

డిసెంబర్ 9, 10 తేదీల్లో చెన్నై మహానగరంలో ఈ పోటీలు జరగనున్నాయి. ఐల్యాండ్‌ గ్రౌండ్స్‌ నుంచి ఓమందూర్‌ ఆసుపత్రి మీదుగా నేపియర్‌ వంతెన వరకు 3.5 కి.మీ దూరం మేర రాత్రిపూట రేసింగ్ పోటీలు నిర్వహించనున్నారు. దక్షిణాసియాలోనే తొలిసారిగా ఈ స్ట్రీట్‌ సర్క్యూట్‌ ఫార్మాలా 4 రేస్‌ నగరంలో జరుగనుంది.

Street Car Racing: ఫార్ములా-4 కార్ రేసింగ్ పోటీలు.. దక్షిణాసియాలో తొలిసారిగా..!
Chennai Street Car Racing
Follow us

| Edited By: Venkata Chari

Updated on: Aug 18, 2023 | 1:43 PM

ఫార్ములా – వన్ కారు రేసింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. స్ట్రీట్ సర్క్యూట్ కారు రేసింగ్ పోటీలు భారతదేశానికి వచ్చేశాయి. దక్షిణాసియాలో తొలిసారిగా స్ట్రీట్‌ సర్క్యూట్‌ ఫార్ములా 4 కార్‌ రేస్‌ పోటీలకు తమిళనాడు రాజధాని చెన్నై ఆతిథ్యమివ్వనుంది. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌, చెన్నై కార్పొరేషన్‌ అభివృద్ధి అథారిటీ, రాష్ట్ర క్రీడాభివృద్ధి శాఖ, రేసింగ్‌ ప్రమోషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ స్ట్రీట్ సర్క్యూట్ కార్ రేస్‌ పోటీలు జరగనున్నాయి.

ఫార్ములా – వన్ కారు రేసింగ్..

డిసెంబర్ 9, 10 తేదీల్లో చెన్నై మహానగరంలో ఈ పోటీలు జరగనున్నాయి. ఐల్యాండ్‌ గ్రౌండ్స్‌ నుంచి ఓమందూర్‌ ఆసుపత్రి మీదుగా నేపియర్‌ వంతెన వరకు 3.5 కి.మీ దూరం మేర రాత్రిపూట రేసింగ్ పోటీలు నిర్వహించనున్నారు. దక్షిణాసియాలోనే తొలిసారిగా ఈ స్ట్రీట్‌ సర్క్యూట్‌ ఫార్మాలా 4 రేస్‌ నగరంలో జరుగనుంది. ఈ పోటీల నిర్వహణకు స్టాలిన్ ప్రభుత్వం రూ.42 కోట్లు కేటాయించింది. రాష్ట్ర క్రీడాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన చెన్నై ఫార్ములా రేసింగ్‌ సర్క్యూట్‌ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ విడుదల చేశారు.