India vs Japan: చరిత్రకు రెండడుగుల దూరంలో భారత్.. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు కీలక పోరు..

Asian Champions Trophy 2023, India vs Japan Semifinal: చెన్నైలో జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశలో మంచి ప్రదర్శన కనబరిచిన భారత హాకీ జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో జపాన్‌తో తలడేందుకు సిద్ధమైంది. భారత్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే Fancode మొబైల్ యాప్, వెబ్‌సైట్‌లో భారతదేశం vs జపాన్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్‌ని చూడొచ్చు.

India vs Japan: చరిత్రకు రెండడుగుల దూరంలో భారత్.. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు కీలక పోరు..
Asian Champions Trophy 2023
Follow us

|

Updated on: Aug 11, 2023 | 3:56 PM

Asian Champions Trophy 2023: చెన్నైలో జరుగుతోన్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2023 గ్రూప్ దశలో టీమిండియా అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోంది. హాకీ ఇండియా (Hockey India) ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించింది. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ మూడింటిలో విజయం సాధించగా, ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఇప్పుడు హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత పురుషుల హాకీ జట్టు ఈరోజు (ఆగస్టు 11) జరిగే సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో జపాన్‌(India vs Japan)తో తలపడనుంది.

గ్రూప్ దశలో ఇరు జట్లు ఇప్పటికే ఓసారి తలపడ్డాయి. కానీ ఆ మ్యాచ్ 1-1తో డ్రా అయింది. ఇప్పుడు ఈ రెండు జట్లు సెమీఫైనల్‌లో పోటీపడుతుండడంతో మ్యాచ్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ నాలుగో స్థానంలో ఉండగా, జపాన్ 19వ స్థానంలో ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో జపాన్‌పై భారత్ పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ, ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయలేం. దీంతో సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఎలా రాణిస్తుందనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది.

ఇవి కూడా చదవండి

సెమీ ఫైనల్ మ్యాచ్ వివరాలు ఇవిగో..

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్ భారత్, జపాన్ మధ్య ఎప్పుడు జరుగుతుంది?

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆగస్టు 11, శుక్రవారం భారత్-జపాన్ జట్ల మధ్య జరగనుంది.

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ జపాన్ మధ్య ఎక్కడ జరుగుతుంది?

చెన్నైలోని మేయర్ రాధాకృష్ణన్ హాకీ స్టేడియంలో భారత్-జపాన్ జట్ల మధ్య ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

భారత్, జపాన్ మధ్య ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

రాత్రి 8.30 గంటలకు భారత్-జపాన్ జట్ల మధ్య ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.

భారతదేశం వర్సెస్ జపాన్ మధ్య జరిగే ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్‌ను ఎక్కడ చూడాలి?

భారత్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే Fancode మొబైల్ యాప్, వెబ్‌సైట్‌లో భారతదేశం vs జపాన్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్‌ని చూడొచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..