Chess World Cup Final Result 2023: ప్చ్‌.. చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌లో ప్రజ్ఞానంద ఓటమి.. ఛాంపియన్‌గా కార్ల్‌సన్‌

ప్రతిష్ఠాత్మక చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత కుర్రాడు ప్రజ్ఞానందకు నిరాశ ఎదురైంది. వరల్డ్‌ నంబర్‌ వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలవాలన్న అతని కల నెరవేరలేదు. గురువారం జరిగిన టై బ్రేకర్‌ పోరులో ప్రజ్ఞానంద ఓడిపోయాడు. తొలిరౌండ్‌ తొలిగేమ్‌లో ప్రజ్ఞానందపై కార్ల్‌సన్‌ విజయం సాధించగా.. రెండో గేమ్‌ డ్రాగా ముగిసింది. దీంతో ప్రజ్ఞానందకు ఓటమి తప్పలేదు. అయితే ఫైనల్‌లో ఓడిపోయినా అందరి మనసులు గెల్చుకున్నాడీ భారత కుర్రాడు. గ్రాండ్‌ మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత..

Chess World Cup Final Result 2023: ప్చ్‌.. చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌లో ప్రజ్ఞానంద ఓటమి.. ఛాంపియన్‌గా  కార్ల్‌సన్‌
Praggnanandhaa, Carlsen
Follow us
Basha Shek

|

Updated on: Aug 24, 2023 | 5:44 PM

ప్రతిష్ఠాత్మక చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత కుర్రాడు ప్రజ్ఞానందకు నిరాశ ఎదురైంది. వరల్డ్‌ నంబర్‌ వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలవాలన్న అతని కల నెరవేరలేదు. గురువారం జరిగిన టై బ్రేకర్‌ పోరులో 18 ఏళ్ల ప్రజ్ఞానంద ఓడిపోయాడు. తొలిరౌండ్‌ తొలిగేమ్‌లో ప్రజ్ఞానందపై కార్ల్‌సన్‌ విజయం సాధించగా.. రెండో గేమ్‌ డ్రాగా ముగిసింది. దీంతో ప్రజ్ఞానందకు ఓటమి తప్పలేదు. అయితే ఫైనల్‌లో ఓడిపోయినా అందరి మనసులు గెల్చుకున్నాడీ భారత కుర్రాడు. గ్రాండ్‌ మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ఫిడే చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరుకున్న భారత ఆటగాడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ఫైనల్‌లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ ప్లేయర్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌తో పోటాపోటీగా తలపడ్డాడు. కాగా ప్రపంచకప్‌లో ఫైనల్ ఆడిన ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడు ప్రజ్ఞానంద్. టైటిల్ మ్యాచ్‌లో కార్ల్‌సెన్‌కు గట్టి పోటీ ఇచ్చాడు.  కాగా ఫైనల్ లో  తొలి 2 రౌండ్లు డ్రాగా ముగియడంతో గురువారం ఇద్దరి మధ్య టైబ్రేకర్ మ్యాచ్ జరిగింది. 25 నిమిషాల తొలి ర్యాపిడ్ గేమ్‌లో కార్ల్‌సన్‌ విజేతగా నిలిచి 1-0 ఆధిక్యంలోకి వెళ్లాడు.  రెండో గేమ్‌లో, భారత స్టార్‌కు పునరాగమనం చేసే అవకాశం ఉంది. అయితే అనుభవజ్జుడైన కార్ల్ సన్ ముందు నిలవలేకపోయాడు ప్రజ్ఞానంద్. రెండో గేమ్‌ డ్రా కావడంతో కేవలం రన్నరప్‌ టైటిల్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అంతకుముందు, సెమీ-ఫైనల్స్‌లో టైబ్రేక్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో ​​కరువానాను ఓడించి ప్రజ్ఞానంద్ ఫైనల్‌లోకి ప్రవేశించాడు.

ఇవి కూడా చదవండి

ఛాంపియన్ గా మాగ్నస్ కార్ల్ సన్