World Cup 2023: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రిక్వెస్ట్.. మరోసారి ప్రపంచ కప్ షెడ్యూల్‌లో మార్పులు?
World Cup 2023 PAK vs SL: ప్రపంచ కప్ 2023లో కొన్ని మ్యాచ్‌ల తేదీలను మరోసారి మారవచ్చని తెలుస్తోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తన సమస్యను బీసీసీఐకి తెలపడంతో.. మరోసారి మార్పు చర్చ మొదలైంది. ఇప్పటికే ఓసారి షెడ్యూల్ మార్చిన ఐసీసీ, మరోసారి మార్చుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ICC World Cup 2023, Hyderabad: ప్రపంచ కప్ 2023నకు రంగం సిద్ధమైంది. ఈమేరకు భారత్‌లో ఏర్పాట్లు చకచకా పూర్తిచేస్తున్నారు. అయితే, ఇప్పటికే కొన్ని మ్యాచ్‌ల తేదీలు మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అహ్మదాబాద్, కోల్‌కతాలో జరగాల్సిన మ్యాచ్‌ల తేదీలను మార్చిన సంగతి తెలిసిందే. పండుగల కారణంగా ఈ రెండు ప్రాంతాల్లోనూ మార్పు వచ్చింది.
ఐసీసీ ఇన్ స్టా పోస్ట్..
ఇవి కూడా చదవండిView this post on Instagram
ఇక ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌ల తేదీలను కూడా మార్చవచ్చని నివేదికలు వస్తున్నాయి. అక్టోబర్ 9, 10 తేదీల్లో హైదరాబాద్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ విషయమై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాతో మాట్లాడినట్లు తెలుస్తోంది.
ఐసీసీ వరల్డ్ కప్ ట్రోపీ విశేషాలు..
View this post on Instagram
అక్టోబర్ 9న హైదరాబాద్‌లో న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత వెంటనే మరుసటి రోజు అంటే అక్టోబర్ 10న పాకిస్థాన్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తల ప్రకారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐకి లేఖ రాసింది. ఈ రెండు మ్యాచ్‌ల మధ్య సమయం కావాలని అసోసియేషన్ కోరింది. భద్రతా ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని తేదీని మార్చాలని హెచ్‌సీఏ కోరినట్లు తెలుస్తోంది.
ఆటగాళ్ల మస్కట్..
View this post on Instagram
వార్తల ప్రకారం, హైదరాబాద్ పోలీసులు వరుసగా రెండు మ్యాచ్‌లలో భద్రతా ఏర్పాట్లపై ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ క్రికెట్ జట్టు కూడా హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఆడనుంది. అందువల్ల ఈ మ్యాచ్‌కు సంబంధించి భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. హైదరాబాద్‌లో మొత్తం 3 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అక్టోబర్ 6న పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత రెండో మ్యాచ్ అక్టోబర్ 9న జరగనుంది. ఇక మూడో మ్యాచ్ అక్టోబర్ 10న జరగనుంది. అక్టోబర్ 14న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అందుకే ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ కూడా సమయం కోరింది.
ట్రోఫీ వివరాలను తెలిపిన ఐసీసీ..
View this post on Instagram
ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుంచిప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లో జరగనుంది. నవంబర్ 15న టోర్నీ తొలి సెమీఫైనల్ జరగనుంది. కాగా, రెండో సెమీఫైనల్ నవంబర్ 16న జరగనుంది. టోర్నీ చివరి మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..