Virat Kohli: కోహ్లీ గ్యారేజ్ ఖాళీ.. ఐపీఎల్‌కు ముందు తన ఖరీదైన కార్లను అమ్మేసిన విరాట్.. కారణమేంటంటే?
మైదానం బయట కోహ్లీ గురించి మాట్లాడితే అతని సోషల్ మీడియా ఫాలోయింగ్, స్టైల్, ఇంకా లగ్జరీ లైఫ్‌స్టైల్ చర్చకు వస్తాయి. ముఖ్యంగా విరాట్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. జాగ్వార్, ల్యాండ్ రోవర్, బెంట్లీ తదితర సూపర్ అండ్ లగ్జరీ కార్లు కోహ్లీ గ్యారేజ్‌లో ఉండేవి.
విరాట్ కోహ్లీ గురించి మాట్లాడినప్పుడల్లా అంతర్జాతీయ క్రికెట్‌లో అతను చేసిన సెంచరీల గురించి మొదట ప్రస్తావనకు వస్తుంది. అలాగే అతని బ్యాట్ నుంచి జాలువారిన వేలాది పరుగుల మీదే చర్చ జరుగుతుంది. అలాగే లెక్కలేనన్నీ రికార్డులు కూడా వస్తాయి. మరి మైదానం బయట కోహ్లీ గురించి మాట్లాడితే అతని సోషల్ మీడియా ఫాలోయింగ్, స్టైల్, ఇంకా లగ్జరీ లైఫ్‌స్టైల్ చర్చకు వస్తాయి. ముఖ్యంగా విరాట్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. జాగ్వార్, ల్యాండ్ రోవర్, బెంట్లీ తదితర సూపర్ అండ్ లగ్జరీ కార్లు కోహ్లీ గ్యారేజ్‌లో ఉండేవి. అయితే ఐపీఎల్ సీజన్‌కు ముందే పలు కార్లను అమ్మేశాడట విరాట్. ఈ విషయాన్ని స్వయంగా అతనే చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆర్‌సీబీ జట్టు ఆటగాళ్లకు ఫొటోషూట్ నిర్వహించింది. వీటన్నింటిని తమ బోల్డ్ డైరీస్‌లో షేర్ చేసింది. ఈ సందర్భంగా కోహ్లి బోల్డ్ డైరీస్‌లో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
ముందు చూపు లేకుండా కొన్నా..
‘ నా గ్యారేజ్‌లో ఉన్న చాలా కార్లు ముందు చూపు లేకుండా కొన్నవే. వాటిని నేను పెద్దగా నడిపింది కూడా లేదు. ఓ సమయం వచ్చిన తర్వాత వాటిని అనవసరంగా కొన్నాను అనిపించింది. అందుకే చాలా వాటిని అమ్మేశాను. ఇప్పుడు మాకు కచ్చితంగా అవసరం అనిపించేవే వాడుతున్నాం. ఏవి అవసరం ఏవి కాదు అని తెలుసుకునే సమయం వచ్చిన తర్వాత అనవసరమైన కార్లను అమ్మేశాను’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇదే సందర్భంగా వివ్ రిచర్డ్స్, సచిన టెండూల్కర్ తన ఆరాధ్య క్రికెటర్లని, వాళ్లు క్రికెట్ నే మార్చిన ప్లేయర్స్ అని ప్రశంసలు కురిపించాడు.
Behind the Scenes with Virat Kohli at RCB Team Photoshoot
Current playlist, new tattoo, trump cards and more… Know more about the personal side of @imVKohli, on Bold Diaries.#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 pic.twitter.com/nCatZhgFAQ
— Royal Challengers Bangalore (@RCBTweets) March 29, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..