Virat Kohli: స్పెషల్‌ గిఫ్ట్‌తో కోహ్లీని సర్‌ప్రైజ్‌ చేసిన బాలిక.. రిటర్న్‌గా విరాట్ ఏం చేశాడో తెలుసా?

రెండో వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండగా.. అభిమానులు భారీగా వారిని చూసేందుకు వచ్చారు. అభిమానుల కోరికను కాదనలేకుండా భారత ఆటగాళ్లు తమ ఫ్యాన్స్‌ను కలుసుకున్నారు. వారితో సరదాగా ఫొటోలు, సెల్ఫీలు దిగారు.

Virat Kohli: స్పెషల్‌ గిఫ్ట్‌తో కోహ్లీని సర్‌ప్రైజ్‌ చేసిన బాలిక.. రిటర్న్‌గా విరాట్ ఏం చేశాడో తెలుసా?
Virat Kohli
Follow us
Basha Shek

|

Updated on: Jul 30, 2023 | 6:52 PM

భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. ఇప్పటికే టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ప్రస్తుతం వన్డే సిరీస్‌ను ఆడుతోంది. రెండో మ్యాచ్‌లో భారత్‌పై గెలిచిన విండీస్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమంచేసింది. కాగా, రెండో వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండగా.. అభిమానులు భారీగా వారిని చూసేందుకు వచ్చారు. అభిమానుల కోరికను కాదనలేకుండా భారత ఆటగాళ్లు తమ ఫ్యాన్స్‌ను కలుసుకున్నారు. వారితో సరదాగా ఫొటోలు, సెల్ఫీలు దిగారు. ఇదే క్రమంలో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీకి ఒక చిరుకానుక కూడా అందింది. టీమ్ ఇండియా మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, స్టాండ్స్ నుండి ఒక అమ్మాయి ‘కోహ్లీ-కోహ్లీ’ అని పదే పదే పిలవడం వినిపించింది. కోహ్లీని ఎలాగైనా కలవాలనుకున్నఆమె తన అభిమాన క్రికెటర్‌ కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చింది. బాలిక గొంతు విన్న కోహ్లీ కూడా తన అభిమానిని కలిసేందుకు వచ్చాడు. అప్పుడు ఆ అమ్మాయికి ఒక బ్రేస్‌లెట్‌ బహుమతిగా ఇచ్చింది. అభిమాని ఎంతో ఇష్టంగా ఇచ్చిన బ్రేస్‌లెట్‌ను తీసుకున్న కోహ్లీ వెంటనే దానిని చేతికి ధరించాడు. ఆతర్వాత ఆ అమ్మాయితో పాటు తన కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడాడు. వారితో కలిసి ఒక సెల్ఫీ దిగాడు. ఆతర్వాత మరికొందరు అభిమానులతో సెల్ఫీలు దిగి మళ్లీ ప్రాక్టీసుకు వెళ్లిపోయాడు.

టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్‌ సూర్యకుమార్ యాదవ్ కూడా అభిమానులను కలుసుకుని ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. టీమ్ కెప్టెన్ రోహిత్ కూడా ఫ్యాన్స్‌తో సెల్ఫీ దిగాడు. కాగా రెండో వన్డేలో కోహ్లీ, రోహిత్‌లు ఆడలేదు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరికీ విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. అయితే రెండో మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడంతో టీమిండియాపై విమర్శలు వచ్చాయి. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని వెస్టిండీస్ నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇక సిరీస్‌ను నిర్ణయించే చివరి వన్డే మంగళవారం ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో జరగనుంది. శుక్రవారం నుంచి ఇరు జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..