Jitesh Sharma: ఆ స్టార్‌ క్రికెటర్ వీడియోలు చూస్తూ ఫినిషింగ్‌ నేర్చుకుంటున్నా.. టీమిండియా నయా సెన్సేషన్‌ జితేశ్‌

ఒత్తిడిని ఎలా అధిగమించాలో ఆటను చివరి వరకు ఎలా తీసుకురావాలో, బౌలర్లను ఎలా లక్ష్యంగా చేసుకోవాలో మిస్టర్‌ కూల్‌ నుంచే నేర్చుకుంటున్నాను. అయితే ఇప్పటివరకు నేను ఆయనను కలవలేదు. భగవంతుడి దయ వల్ల ఆయనతో మాట్లాడే అవకాశం దొరికితే ఇంకా నేర్చుకుంటానని భావిస్తున్నా' అని చెప్పుకొచ్చాడు జితేశ్‌.

Jitesh Sharma: ఆ స్టార్‌ క్రికెటర్ వీడియోలు చూస్తూ ఫినిషింగ్‌ నేర్చుకుంటున్నా.. టీమిండియా నయా సెన్సేషన్‌ జితేశ్‌
Jitesh Sharma
Follow us
Basha Shek

|

Updated on: Jan 06, 2023 | 12:46 PM

భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు జరగ్గా సిరీస్‌ 1-1తో సమానంగా ఉంది. కాగా తొలి మ్యాచ్ తర్వాత టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా సంజూ శాంసన్ జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో విదర్భకు చెందిన జితేష్ శర్మను జట్టులోకి తీసుకున్నారు. ఇతర యంగ్ ప్లేయర్ల   మాదిరిగానే, జితేష్ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని తన రోల్ మోడల్‌గా భావిస్తాడు. భారత క్రికెట్‌లో అన్నీ ఎంఎస్ ధోని తర్వాతే మొదలవుతాయంటున్నాడీ లేటెస్ట్‌ సెన్సేషన్‌. అంతేకాదు జట్టులో ఫినిషర్ పాత్రను చక్కగా పోషించేందుకు ధోని వీడియోలు చూస్తున్నట్లు కూడా జితేష్ తెలిపాడు. ‘ భారత క్రికెట్‌ చరిత్రంలో ధోనిది ప్రత్యేక స్థానం. నాతో పాటు ఎందరో క్రికెటర్లకు ఆయన స్ఫూర్తి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన క్రికెట్‌ స్కిల్స్ అద్భుతం. నా ఖాళీ సమయంలో, నేను ధోని వీడియోలను చూస్తాను. ఒత్తిడిని ఎలా అధిగమించాలో ఆటను చివరి వరకు ఎలా తీసుకురావాలో, బౌలర్లను ఎలా లక్ష్యంగా చేసుకోవాలో మిస్టర్‌ కూల్‌ నుంచే నేర్చుకుంటున్నాను. అయితే ఇప్పటివరకు నేను ఆయనను కలవలేదు. భగవంతుడి దయ వల్ల ఆయనతో మాట్లాడే అవకాశం దొరికితే ఇంకా నేర్చుకుంటానని భావిస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు జితేశ్‌.

కాగా దేశవాళి క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తోన్న జితేశ్‌ 2016లో 10 లక్షల రూపాయల కనీస ధరతో ఐపీఎల్‌ వేలంలోకి రాగా.. ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసింది. అయితే ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు. ఆతర్వాత 2022 మెగా వేలంలో పంజాబ్‌ కింగ్స్‌ జితేశ్‌ను కొనుగోలు చేసింది. రూ. 20 లక్షలు వెచ్చించి అతడిని జట్టులోకి తీసుకుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా అరంగేట్రం చేసిన జితేశ్‌ మొత్తం17 బంతులు ఎదుర్కొని 26 పరుగులు చేశాడు. చెన్నైపై విజయం సాధించిన ఈ మ్యాచ్లో మూడో టాప్‌ స్కోరర్‌ జితేశ్‌ కావడం విశేషం. ఆ తర్వాత ముంబైతో మ్యాచ్‌లో 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. ఇక ఆఖరిసారిగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆడిన 7 బంతుల్లో 19 పరుగులు చేశాడు. జితేష్ ఇప్పటివరకు 12 IPL మ్యాచ్‌లు ఆడాడు, 29.25 సగటుతో 234 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని స్ట్రైక్ రేట్ 163.64. ఒత్తిడి సమయాల్లో సులువుగా భారీ షాట్లు ఆడే సామర్థ్యం ఈ యంగ్‌ ప్లేయర్‌ సొంతం. పైగా వికెట్‌ కీపింగ్‌ కూడా చేయగలడు. ఈ కారణంగానే సంజూ స్థానంలో టీమిండియాలో అనూహ్యంగా స్థానం దక్కించుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..