Asia Cup: వన్డేల్లో చెత్త రికార్డ్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్.. కట్‌చేస్తే.. ఆసియా కప్‌లో ఎంట్రీ ఇచ్చిన టీ20 సూపర్ స్టార్..

Team India Squad for Asia Cup 2023: ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 17 వరకు పాకిస్థాన్, శ్రీలంకలో ఆసియా కప్ జరగనుంది. కాగా, అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ వేదికగా ప్రపంచకప్ జరగనుంది. ఆసియా కప్‌నకు బీసీసీఐ తన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా చోటు దక్కించుకున్నాడు.

Asia Cup: వన్డేల్లో చెత్త రికార్డ్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్.. కట్‌చేస్తే.. ఆసియా కప్‌లో ఎంట్రీ ఇచ్చిన టీ20 సూపర్ స్టార్..
Team India
Follow us
Venkata Chari

|

Updated on: Aug 23, 2023 | 9:31 AM

Suryakumar Yadav in Asia Cup 2023: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఆసియా కప్ 2023 కోసం తన జట్టును ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సోమవారం (ఆగస్టు 21) ఢిల్లీలో జట్టును ప్రకటించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ 17 మంది సభ్యులతో కూడిన జట్టులోకి తిరిగి వచ్చారు. ఈ జట్టులో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా చోటు దక్కించుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సూర్య వన్డే ప్రపంచకప్ ఆడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ చూడాల్సింది సూర్య టీ20లో నంబర్-1 బ్యాట్స్‌మెన్ అయినప్పటికీ, వన్డేల్లో అతని బ్యాట్ మౌనంగానే మిగిలిపోయింది.

వన్డేల్లో సూర్య ఓవరాల్ రికార్డ్ కూడా చాలా దారుణంగా ఉంది. ఇప్పటి వరకు 26 మ్యాచ్‌లు ఆడిన అతను కేవలం 2 అర్ధశతకాలు మాత్రమే సాధించగలిగాడు. వీటన్నింటిని వదిలేసి ఈ ఏడాది కూడా అతని రికార్డు చూస్తే గత 10 వన్డేల్లో అతని సగటు చాలా దారుణంగా ఉంది. దీంతో పాటు ఈ ఏడాది వన్డేల్లో ఇబ్బందికర ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పాడు. ఇంత జరిగినా అతడికి జట్టులో చోటు దక్కిందంటే అభిమానులకు షాకింగ్‌గానే ఉంది.

ఇవి కూడా చదవండి

వన్డేలలో చెత్త ప్రపంచ రికార్డును నెలకొల్పిన సూర్య..

ఈ ఏడాది సూర్యకు వన్డేల్లో చాలా దారుణంగా మారింది. సూర్య ఈ సంవత్సరం మొత్తం 10 ODIలు ఆడాడు. 14.11 సగటుతో 127 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో సూర్య వరుసగా 3 ODIల్లో గోల్డెన్ డక్ (మ్యాచ్ మొదటి బంతి)కి ఔట్ అయ్యాడు. దీంతో చాలా ఇబ్బందికరమైన రికార్డును సృష్టించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వరుసగా మూడు సార్లు గోల్డెన్ డక్‌తో ఔట్ అయిన ప్రపంచంలోని ఏకైక ఆటగాడు సూర్య మాత్రమే కావడం గమనార్హం.

అలాగే, మూడు ODIల్లో వరుసగా సున్నాకి ఔట్ అయిన ఆరో భారతీయుడు సూర్య. అతని కంటే ముందు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా ఈ చెత్త రికార్డు సృష్టించారు. సచిన్ టెండూల్కర్ 1994లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో సున్నాతో ఔటయ్యాడు. ఇది సచిన్ కెరీర్‌లో ప్రారంభ దశ.

భారత మైదానాల్లోనే ఇబ్బందికర రికార్డ్..

కేవలం భారత మైదానంలోనే సూర్య ఈ చెత్త రికార్డును నెలకొల్పాడు. ఈ ఏడాది మార్చిలో భారత జట్టు ఆస్ట్రేలియాతో స్వదేశంలో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడింది. ఈ క్రమంలో సూర్య గోల్డెన్ డక్ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు అర్థమయ్యే విషయం ఏంటంటే.. వన్డే ప్రపంచకప్ కూడా భారత్ లోనే జరుగుతోంది. అలాంటి పరిస్థితిలో సూర్య గురించి ఆందోళన చెందక తప్పదు.

వరుసగా మూడు వన్డేల్లో సున్నాకి ఔటైన భారత ఆటగాళ్లు..

సచిన్ టెండూల్కర్ (1994)

అనిల్ కుంబ్లే (1996)

జహీర్ ఖాన్ (2003-04)

ఇషాంత్ శర్మ (2010-11)

జస్ప్రీత్ బుమ్రా (2017-2019)

సూర్యకుమార్ యాదవ్ (2023)

దారుణంగా సూర్య ఓవరాల్ వన్డే రికార్డ్..

ఓవరాల్‌గా వన్డేల్లో సూర్య రికార్డును చూస్తే అది కూడా చాలా దారుణంగా కనిపిస్తోంది. అతను ఇప్పటివరకు 26 ODIలు ఆడాడు. అందులో అతని సగటు 24.33గా ఉంది. ఇది అస్సలు బాగాలేదు. ఈ సమయంలో సూర్య 511 పరుగులు మాత్రమే చేశాడు. సూర్య ఇప్పటి వరకు వన్డేల్లో 2 ఫిఫ్టీలు మాత్రమే చేయగలిగాడు. కాగా, సెంచరీ ఖాతా కూడా తెరవలేదు. సూర్య ODI క్రికెట్‌లో 14 మార్చి 2021న అరంగేట్రం చేశాడు. కొలంబోలో శ్రీలంకతో తొలి మ్యాచ్ ఆడాడు.

ఆసియా కప్ కోసం 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఇషాన్ కిషన్, అక్షరు పటేల్, శార్దూల్ థాకూర్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ప్రసీద్ధ్ కృష్ణ.

రిజర్వ్ ప్లేయర్: సంజు శాంసన్

ఆసియా కప్ షెడ్యూల్:

30 ఆగస్టు: పాకిస్థాన్ v నేపాల్ – ముల్తాన్

31 ఆగస్టు: బంగ్లాదేశ్ v శ్రీలంక – క్యాండీ

2 సెప్టెంబర్: భారత్ v పాకిస్థాన్ – క్యాండీ

3 సెప్టెంబర్: బంగ్లాదేశ్ v ఆఫ్ఘనిస్తాన్ – లాహోర్

4 సెప్టెంబర్: భారత్ v నేపాల్ – క్యాండీ

5 సెప్టెంబర్: శ్రీలంక v ఆఫ్ఘనిస్తాన్ – లాహోర్

6 సెప్టెంబరు: A1 Vs B2 – లాహోర్

9 సెప్టెంబర్: B1 vs B2 – కొలంబో (శ్రీలంక vs బంగ్లాదేశ్ కావచ్చు)

10 సెప్టెంబర్: A1 vs A2 – కొలంబో (భారతదేశం v పాకిస్తాన్ కావచ్చు)

12 సెప్టెంబర్: A2 vs B1 – కొలంబో

14 సెప్టెంబర్ : A1 vs B1 – కొలంబో

15 సెప్టెంబర్ : A2 vs B2 – కొలంబో

17 సెప్టెంబర్ : ఫైనల్ – కొలంబో.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..