Chandrayaan 3: ఇస్రోకి అశ్విన్ అభినందనలు.. స్పందించిన ప్రధాని మోదీ..! అసలు విషయం తెలిసి నవ్వేసుకుంటున్న నెటిజన్లు..

R Ashiwn: చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ కావడంతో భారతదేశం సంబరాల్లో మునిగితేలింది. ఈ నేపథ్యంలోనే ఇస్రోపై దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ తారలు, భారత్ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇస్రో టీమ్‌ని అభినందిస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందుకు ప్రధాని నరేంద్ర మోదీయే కారణమని చెప్పుకోవాలి. అవును, అదేలా అంటే.. ‘చరిత్ర. అత్యద్భుత విజయం సాధించిన..

Chandrayaan 3: ఇస్రోకి అశ్విన్ అభినందనలు.. స్పందించిన ప్రధాని మోదీ..! అసలు విషయం తెలిసి నవ్వేసుకుంటున్న నెటిజన్లు..
R Ashwin; Narendra Modi
Follow us

|

Updated on: Aug 24, 2023 | 6:17 AM

Chandrayaan 3: భార‌త్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన చంద్ర‌యాన్‌-3 బుధ‌వారం సాయంత్రం 6:04 గంట‌ల‌కు చంద్రుడి ద‌క్షిణ ధృవం స‌మీపంలో విజయవంతంగా కాలు మోపింది. యావత్ ప్రపంచంలో ఇస్రో  శాస్త్రవేత్తల గొప్పతనాన్ని చాటిచెప్పిన చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ కావడంతో భారతదేశం సంబరాల్లో మునిగితేలింది. ఈ నేపథ్యంలోనే ఇస్రోపై దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ తారలు, భారత్ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇస్రో టీమ్‌ని అభినందిస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందుకు ప్రధాని నరేంద్ర మోదీయే కారణమని చెప్పుకోవాలి. అవును, అదేలా అంటే.. ‘చరిత్ర. అత్యద్భుత విజయం సాధించిన ఇస్రోకి అభినందనలు’ అంటూ అశ్విన్ ట్వీట్ చేశాడు.

అశ్విన్‌తో పాటు ఎందరో క్రికెటర్లు ఇస్రో టీమ్‌ని అభినందించారు. అయితే అశ్విన్ చేసిన ట్వీట్‌కి మాత్రమే ఎవరూ ఊహించని వ్యక్తి నుంచి రిప్లై అందింది. ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రధాని నరేంద్ర మోదీ. అవును, ట్విట్టర్‌లో ప్రధాని మోదీ పేరిట ఓ ఫేమస్ ఫేక్ అకౌంట్ ఉంది. అదే నరేంద్ర మోదీ పారడీ. ఆ ఆకౌండ్ నుంచి అశ్విన్‌కి ‘ప్రతీ భారతీయుడికి శుభాకాంక్షలు. అద్భుత విజయాన్ని సాధ్యం చేసినందుకు ఇస్రోకి ధన్యవాదాలు’ అని రిప్లై వచ్చింది. దీనిపై అశ్విన్ కూడా నిజంగానే తనకు ప్రధాని మోదీ నిజంగానే రిప్లై ఇచ్చారన్నట్లుగా ‘సార్, ఎలా ఉన్నారు..? మీరు నా ట్వీట్‌కి రిప్లై ఇవ్వడంపై నాకు చాలా గర్వంగా ఉంది. ఇది గొప్ప గౌరవం’ అంటూ రిప్టై ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి
R Ashwin

R Ashwin

ఇస్రోకి అశ్విన్ అభినందనలు..

అశ్విన్ రియాక్షన్..

కాగా, అశ్విన్‌తో పాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, శుభమాన్ గిల్, మహ్మద్ సిరాజ్, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా.. ఇలా చాలా మంది ఇస్రోని అభినందించారు.

కొత్త చరిత్ర..

రోహిత్ శర్మ..

విరాట్ కోహ్లీ..

సచిన్ టెండూల్కర్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..