ICC World Cup 2023: టీమిండియాకు రెడ్ అలర్ట్.. ఎంట్రీ ఇచ్చిన డేంజరస్ ప్లేయర్.. రోహిత్ సేనకు ఇక నిద్ర కరువే..
ICC World Cup 2023, New Zealand Cricket Team: గుజరాత్ టైటాన్స్ తరపున ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మోకాలికి గాయంతో ఈ ప్లేయర్ దూరమయ్యాడు. మార్చి నుంచి ఎటువంటి క్రికెట్ ఆడలేదు. ఇటీవల నెట్స్‌లో శిక్షణ, బ్యాటింగ్ ప్రారంభించాడు. ప్రపంచకప్‌నకు ముందు వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో ఈ 33 ఏళ్ల ఆటగాడు జట్టులో చేరనున్నాడు. అయితే, ఈ ప్లేయర్ ఎంట్రీతో టీమిండియాకు డేంజర్ బెల్స్ మోగినట్లేనని తెలుస్తోంది.
ICC World Cup 2023, Kane Williamson: ప్రపంచ కప్ 2023కు ముందు కీలక ప్రకటన వచ్చింది. టీమ్ ఇండియా అతిపెద్ద శత్రువు ఎంట్రీ ఇచ్చేశాడు. భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌నకు ముందు న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ గాయం నుంచి కోలుకుని, సిద్ధంగా ఉన్నాడు. కేన్ విలియమ్సన్ ప్రపంచ కప్ 2023కి ముందు కొన్ని మ్యాచ్‌లు ఆడలేకపోయినా, ఫిట్‌గా ఉన్న తర్వాత అతను తిరిగి వస్తాడని న్యూజిలాండ్ జట్టు ఆశాభావంతో ఉంది.
ప్రపంచ కప్ 2023కి ముందు కీలక ప్రకటన..
కేన్ విలియమ్సన్ గాయం నుంచి కోలుకోవడంపై న్యూజిలాండ్ ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్, టీమ్ మేనేజ్‌మెంట్ సానుకూలంగా ఉన్నారు. న్యూజిలాండ్ ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ, అతను ప్రపంచ కప్ 2023 మొదటి కొన్ని మ్యాచ్‌లలో ఆడకపోయినా, న్యూజిలాండ్ జట్టు అతని చేరికను పరిశీలిస్తుంది. నాకౌట్ స్టేజ్‌లో కివీస్ జట్టులో తప్పకుండా ఉంటాడు అని తెలిపాడు.
టీమిండియాకు అతిపెద్ద శత్రువుగా మారగలడు..
కేన్ విలియమ్సన్ గుజరాత్ టైటాన్స్ తరపున ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మోకాలికి గాయంతో దూరమయ్యాడు. మార్చి నుంచి ఎటువంటి క్రికెట్ ఆడలేదు. ఇటీవల నెట్స్‌లో శిక్షణ, బ్యాటింగ్ ప్రారంభించాడు. ప్రపంచకప్‌నకు ముందు వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో ఈ 33 ఏళ్ల ఆటగాడు జట్టులో చేరనున్నాడు. స్టెడ్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, ‘కేన్ తను కోలుకునే ప్రక్రియపై ప్రతిరోజూ పని చేస్తున్నాడు. మేం దాని గురించి చాలా స్పష్టంగా, జాగ్రత్తగా ఉన్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు.
చివరి వరకు ప్రయత్నిస్తాం..
Glad he is back training for New Zealand once Again🙌💯. #KaneWilliamson pic.twitter.com/pzv1uhhvGf
— Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) August 4, 2023
“విలియమ్సన్ భారతదేశంలో జరిగే ప్రపంచ కప్‌కు వెళ్లాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకునే ముందు మేం తీవ్రంగా ఆలోచించాల్సి ఉంటుంది. మేం అతని వైద్య సలహాను పొందుతాం. మేం అతనిని చూడాలనుకుంటున్న ఫిట్‌నెస్ స్థాయికి చేరుకుంటాం” అని స్టెడ్ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్ 9 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ఆడనుండగా, సెమీ ఫైనల్స్ నవంబర్ 15న ప్రారంభమవుతాయి. విలియమ్సన్ న్యూజిలాండ్ 2015, 2019 టోర్నీల్లో బ్యాక్-టు-బ్యాక్ ఫైనల్స్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. సెప్టెంబరు 5 నాటికి న్యూజిలాండ్ ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంచుకోవాలి. విలియమ్సన్ గైర్హాజరీలో టామ్ లాథమ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..