Virat Kohli: ‘బాబర్ కంటే కోహ్లీ బెస్ట్ ప్లేయర్’.. విరాట్‌పై పాక్ మాజీ బౌలర్ ప్రశంసల జల్లు..

మునుపెన్నడూ లేనివిధంగా టీమిండియా ప్లేయర్ల మీద పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రెండు రోజుల క్రితం పాక్ మాజీ ఆఫ్ స్పిన్నర్  సక్లైన్ ముస్తాన్ ‘సచిన్, ద్రావిడ్ మైదానంలో చిరుతలు అంటూ కొనియాడారు. తాజాగా..

Virat Kohli: ‘బాబర్ కంటే కోహ్లీ బెస్ట్ ప్లేయర్’.. విరాట్‌పై పాక్ మాజీ బౌలర్ ప్రశంసల జల్లు..
Virat KohliImage Credit source: Social Media
Follow us
శివలీల గోపి తుల్వా

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 28, 2023 | 3:08 PM

ఎప్పుడూ భారత్, టీమిండియా ఆటగాళ్ల మీద నోరు పారేసుకునే పాక్ మాజీలు ఈ మధ్య తమ పంథా మార్చుకున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా టీమిండియా ప్లేయర్ల మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రెండు రోజుల క్రితం పాక్ మాజీ ఆఫ్ స్పిన్నర్  సక్లైన్ ముస్తాన్ ‘సచిన్, రాహుల్ ద్రావిడ్ మైదానంలో చిరుతలు, వారిని ఔట్ చేయడం అంత తేలిక కాదు’ అని కీర్తించాడు. తాజాగా పాక్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్‌ రజాక్‌ కోహ్లీని తన పొగడ్తలతో ముంచెత్తాడు. అంతేకాక తన దేశానికి చెందిన బాబర్ అజామ్ కంటే కింగ్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడని పేర్కొన్నాడు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఈ పాక్ మాజీ ఆటగాడు విరాట్ ప్రపంచ స్థాయి ఫిట్‌నెస్‌ని కలిగి ఉన్నాడని, ఆ విషయంలో బాబర్ అజామ్ తేలిపోతాడని తెలిపాడు.

‘విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు. కెప్టెన్‌గా కూడా జట్టును అద్భుతంగా నడిపించాడు. ఎప్పుడూ పాజిటివ్‌‌గా ఉంటూ.. టీమ్ నైపుణ్యాలను చక్కగా వినియోగించుకుంటాడు. విరాట్‌లో మరో అత్యుత్తమ విషయం తన ప్రపంచస్థాయి ఫిట్‌నెస్. ఇక విరాట్‌తో పోలిస్తే బాబర్ అజామ్‌ ఫిట్‌నెస్‌ చాలా పూర్‌గా ఉంటుంది. అంతర్జాతీయంగా వన్డేల్లోనూ బాబర్ అజామ్ టాప్ ప్లేయర్. ఫార్మాట్‌ ఏదైనా నిలకడగా ఆడతాడు. విరాట్‌తో బాబర్‌ను పోల్చాల్సిన అవసరం లేదు. ఇదెలా ఉంటుందంటే.. కపిల్ దేవ్‌, ఇమ్రాన్‌ ఖాన్‌ మధ్య పోలిక పెట్టినట్లు ఉంటుంది. కాబట్టి, విరాట్ కోహ్లీ భారత్‌ అత్యుత్తమ ఆటగాడు. బాబర్‌ పాక్‌కు చెందిన టాప్‌ ప్లేయర్. ప్రతిదేశానికి వారిలాంటి ప్లేయర్లు ఉంటారు. వీరిద్దరూ ప్రపంచస్థాయి ఆటగాళ్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఫిట్‌నెస్‌ విషయంలోనే వీరి మధ్య కాస్త తేడా ఉంటుంది. ఆ విషయంలో కోహ్లీదే పైచేయి. అందుకే బాబర్ కంటే విరాట్ అత్యుత్తమం’ అని అబ్దుల్‌ రజాక్‌ తెలిపాడు.

Abdul Razzaq On Kohli And Babar

Abdul Razzaq On Kohli And Babar

పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్.. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ రేంజ్‌లో ఆకాశానికి ఎత్తేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అటు కోహ్లీ అభిమానులు మాత్రం రజాక్ తమ అభిమాన క్రికెటర్‌పై చేసిన కామెంట్స్ పట్ల పొంగిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..