Team India: విరాట్ కోహ్లీ ఇన్‌స్టా పోస్ట్‌పై బీసీసీఐ ఫైర్.. ఆటగాళ్లందరికీ కీలక సూచనలు..

Asia Cup 2023: ఆసియా కప్‌కు సన్నద్ధం కావడానికి బెంగళూరులో టీమిండియా క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. 6 రోజుల క్యాంపును ఏర్పాటు చేసింది. తొలిరోజు ఆటగాళ్లకు యో-యో టెస్టు నిర్వహించారు. ఆ శిబిరంలో విరాట్ కోహ్లీ కూడా భాగమయ్యాడు. భారత బ్యాట్స్‌మన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో క్యాంప్ మొదటి రోజు ఫొటోను పంచుకున్నాడు. దీనిపై BCCI అభ్యంతరం తెలిపింది.

Team India: విరాట్ కోహ్లీ ఇన్‌స్టా పోస్ట్‌పై బీసీసీఐ ఫైర్.. ఆటగాళ్లందరికీ కీలక సూచనలు..
Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Aug 25, 2023 | 7:42 AM

Indian Cricket Team: సోషల్ మీడియాలో తమ ఫిట్‌నెస్ స్కోర్‌ల గురించి ఎటువంటి సమాచారం ఇవ్వవద్దని భారత జట్టు మేనేజ్‌మెంట్ ఆటగాళ్లను కోరింది. విరాట్ కోహ్లీ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత మేనేజ్‌మెంట్ ఈ సలహా ఇచ్చింది. ఆ తర్వాత కోహ్లి చర్య బీసీసీఐకి నచ్చలేదని తెలుస్తోంది. వాస్తవానికి ఆసియా కప్‌నకు ముందు బెంగళూరులో శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా ఆటగాళ్లందరూ ఉన్నారు. ఈ శిబిరం మొదటి రోజు, కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. అందులో కోహ్లీ యో యో టెస్ట్‌లో 17.2 స్కోర్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.

కోహ్లీ చేసిన ఈ పోస్ట్ బోర్డుకు నచ్చలేదు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం, శిబిరంలో పాల్గొన్న ఆటగాళ్లందరికీ బోర్డు అభిప్రాయం గురించి తెలియజేసింది. మీడియా నివేదికల ప్రకారం, సోషల్ మీడియాలో ఏదైనా రహస్య విషయాలను పంచుకోవద్దని ఆటగాళ్లకు మౌఖికంగా తెలియజేసినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఆటగాళ్లు పరుగులను పోస్ట్ చేసుకోవచ్చు. కానీ, స్కోర్‌లను పోస్ట్ చేయడం కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘిస్తుందని ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మొదటి రోజు యో-యో పరీక్ష..

Virat Kohli Yoyo Test

భారత జట్టు మేనేజ్‌మెంట్ ఆటగాళ్ల కోసం 6 రోజుల క్యాంపును ఏర్పాటు చేసింది. తొలిరోజు ఆటగాళ్లకు యో-యో టెస్టు నిర్వహించారు. ఆసియా కప్‌నకు ముందు, 13 రోజుల ఫిట్‌నెస్ ప్రోగ్రామ్ ఇచ్చిన ఆటగాళ్లకు పూర్తి బాడీ టెస్ట్ ఉంటుంది. ఇందులో రక్త పరీక్ష కూడా ఉంటుంది. శిక్షకులు వారి ఫిట్‌నెస్‌ని తనిఖీ చేస్తారు. ఆ ప్రమాణానికి అనుగుణంగా లేని వారిపై చర్యలు తీసుకోవచ్చు. వాస్తవానికి, ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బోర్డు ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు.

13 రోజుల ఫిట్‌నెస్ ప్రోగ్రామ్..

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

వెస్టిండీస్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన, ఐర్లాండ్‌తో జరిగిన 3 T20 సిరీస్‌లో భాగం కాని ఆటగాళ్లకు మేనేజ్‌మెంట్ 13 రోజుల ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ను అందించింది. రోహిత్, కోహ్లి, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ విరామ సమయంలో ఈ కార్యక్రమాన్ని అనుసరించాలని మేనేజ్‌మెంట్ కోరింది.

జిమ్ లో విరాట్ కోహ్లీ కసరత్తులు..

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..