WTC Final 2023: ‘ఆస్ట్రేలియా కంటే భారత్ వీక్‌, వాళ్లే నా టైటిల్ ఫేవరెట్’.. టెస్ట్ ఫైనల్‌పై పాకిస్థాన్ బౌలింగ్ దిగ్గజం వ్యాఖ్యలు..

WTC Final 2023, IND vs AUS: వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌‌లో భారత్‌, ఆస్ట్రేలియా జట్లు తలపడబోతున్న సంగతి తెలిసిందే. లండన్‌లోని ఓవల్‌ మైదానంలో జాన్‌ 7 నుంచి జూన్‌ 11 వరకు జరిగే ఈ మ్యాచ్‌లో విజయం సాధించి.. అన్ని ఫార్మట్లలో ప్రపంచ విజేతగా..

WTC Final 2023: ‘ఆస్ట్రేలియా కంటే భారత్ వీక్‌, వాళ్లే నా టైటిల్ ఫేవరెట్’.. టెస్ట్ ఫైనల్‌పై పాకిస్థాన్ బౌలింగ్ దిగ్గజం వ్యాఖ్యలు..
Wasim Akram on WTC Final 2023
Follow us

|

Updated on: Jun 05, 2023 | 5:34 PM

WTC Final 2023, IND vs AUS: వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌‌లో భారత్‌, ఆస్ట్రేలియా జట్లు తలపడబోతున్న సంగతి తెలిసిందే. లండన్‌లోని ఓవల్‌ మైదానంలో జాన్‌ 7 నుంచి జూన్‌ 11 వరకు జరిగే ఈ మ్యాచ్‌లో విజయం సాధించి.. అన్ని ఫార్మట్లలో ప్రపంచ విజేతగా నిలిచిన తొలి క్రికెట్ టీమ్‌గా అవతరించాలని ఇరు జట్లు తహతహలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల క్రికెట్ టీమ్స్ ప్రాక్టీస్‌ చేయడంలో ముగిగిపోయాయి. మరోవైపు డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ గురించి పలువురు మాజీలు తమతమ అభిప్రాయాలను కూడా తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమలోనే తాజాగా పాకిస్థాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ కూడా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగే డబ్య్లూటీసీ ఫైనల్‌పై తన అభిప్రాయాన్ని వెల్లబుచ్చాడు.

వసీం అక్రమ్ మాట్లాడుతూ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్ విజేతగా నిలిచేందుకు భారత్‌ కంటే ఆస్ట్రేలియాకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని, బౌలింగ్ విషయంలో కూడా భారత్ బలహీనంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. ‘ఓవల్‌ మైదానంలో సాధారణంగా ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటిలోనే టెస్టు మ్యాచ్‌లు జరగుతాయి. అప్పడు పిచ్‌ బాగా డ్రైగా ఉండడం వల్ల బ్యాట్లరకు అనుకూలంగా ఉటుంది. కానీ భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే డబ్ల్యూటీసీ పైనల్‌ జూన్‌ నెలలో జరగుతుంది. ఇప్పుడు ఓవల్ పిచ్‌ చాలా ఫ్రెష్‌ ఉంటుంది. ఫలితంగా బంతి ఎక్కువగా బౌన్స్‌ అయ్యే అవకాశం ఉంది. ఇదే కాక డ్యూక్‌ బంతి ఎక్కువగా స్వింగ్‌ అవుతుంది. డ్యూక్‌ బంతి కూకబుర్ర కంటే చాలా గట్టిగా ఉంటుంద’న్నాడు.

ఇంకా ‘ఆసీస్‌ బౌలర్లు బౌన్సర్లు ఎక్కువగా వేస్తే టీమిండియా బ్యాట్స్‌మెన్ కచ్చితంగా ఇబ్బంది పడతారు. భారత బౌలింగ్‌ ఎటాక్‌ ఆస్ట్రేలియాతో పోలిస్తే కాస్త  బలహీనంగా ఉంది. నా మేరకు అయితే ఆస్ట్రేలియానే టైటిల్‌ ఫేవరేట్‌’ అంటూ వసీం అక్రమ్ తెలిపాడు. అక్రమ్ కంటే ముందుగా టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రీ, ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ఆరోన్ ఫించ్, న్యూజిలాండ్ స్పిన్ దిగ్గజం డానియెల్ వెటోరీ సహా పలువురు మాజీలు డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్‌పై తమ రియాక్షన్స్ ఏమిటో తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..