Asia Cup 2023: పాకిస్తాన్‌తో మ్యాచ్.. ఆ కీలక ప్లేయర్ స్థానంలో హైదరాబాదీ అరంగేట్రం పక్కా..!

ఆసియా కప్ 2023 కోసం ఎంపికైన భారత జట్టులో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మకు చోటు దక్కిన సంగతి తెలిసిందే. మిడిలార్డర్ బలోపేతానికి.. అలాగే అత్యంత కీలకమైన నాలుగో స్థానంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌గా తిలక్ వర్మ రాణిస్తుండటంతో.. పాకిస్తాన్‌తో జరగబోయే మ్యాచ్‌తో అతడు వన్డేల్లోకి..

Asia Cup 2023: పాకిస్తాన్‌తో మ్యాచ్.. ఆ కీలక ప్లేయర్ స్థానంలో హైదరాబాదీ అరంగేట్రం పక్కా..!
Tilak Varma
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 24, 2023 | 9:00 PM

ఆసియా కప్ 2023 కోసం ఎంపికైన భారత జట్టులో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మకు చోటు దక్కిన సంగతి తెలిసిందే. మిడిలార్డర్ బలోపేతానికి.. అలాగే అత్యంత కీలకమైన నాలుగో స్థానంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌గా తిలక్ వర్మ రాణిస్తుండటంతో.. పాకిస్తాన్‌తో జరగబోయే మ్యాచ్‌తో అతడు వన్డేల్లోకి అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయం అని అంటున్నారు మాజీ క్రికెటర్లు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్ 2023లో టీమిండియా ప్రారంభ మ్యాచ్‌లో తిలక్ వర్మకు కచ్చితంగా తుది జట్టులో చోటు ఇవ్వాలంటున్నాడు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. మిడిలార్డర్‌లో జట్టుకు ఎంతగానో ఉపయోగపడతాడని స్పష్టం చేశాడు.

వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా తరపున టీ20ల్లో అరంగేట్రం చేసిన తిలక్ వర్మ.. ఆ సిరీస్‌లో అత్యధిక రన్ గెట్టర్(173)గా క్రికెట్ దిగ్గజాలను సైతం తనదైన శైలి షాట్స్‌తో ఆకర్షించాడు. ఆ వెంటనే ఆసియా కప్‌కు ఎంపికయ్యాడు. అత్యంత కీలకమైన నాలుగో స్థానంలో లెఫ్ట్ హ్యాండర్‌గా తిలక్ వర్మ రాణిస్తుండటం.. టీమిండియాకు కలిసొచ్చే అంశం అని అజిత్ అగార్కర్ కూడా ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌లో చెప్పకనే చెప్పాడు. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 2న పాకిస్తాన్‌తో జరిగే కీలక మ్యాచ్‌లో తిలక్ వర్మను తుది జట్టులో ఆడించాలని కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తెలిపాడు.

పాక్‌తో మ్యాచ్‌లో తన తుది జట్టు గురించి మాట్లాడిన సంజయ్ మంజ్రేకర్.. ‘ముగ్గురు సీమర్లుగా బుమ్రా, సిరాజ్, షమీ.. నాలుగో సీమర్‌గా హార్దిక్ పాండ్యా.. ఇక స్పిన్నర్లుగా జడేజా, కుల్దీప్.. ఓపెనర్లుగా గిల్, రోహిత్ శర్మ ఉంటారని.. మూడో నెంబర్‌లో ఎప్పటిలానే విరాట్ కోహ్లీ.. వికెట్ కీపర్‌గా కెఎల్ రాహుల్.. ఇక నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ కంటే తిలక్ వర్మకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశాడు. ఎందుకంటే.. బరిలోకి దిగే ఏడుగురు బ్యాటర్లలో దాదాపుగా అందరూ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్లు ఉన్నారని.. అందుకే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌గా తిలక్ వర్మను ఆడించాలని చెప్పుకొచ్చాడు. అయితే అతడ్ని ఏ స్థానంలో బ్యాటింగ్‌కు పంపించాలన్నది ఇప్పుడు టీమిండియాకు ఉన్న పెద్ద సమస్య అని సంజయ్ మంజ్రేకర్ చెప్పాడు. అలా కాదని.. పూర్తిగా ఫిట్‌గా లేని కెఎల్ రాహుల్ తుది జట్టులో చోటు దక్కించుకోకపోతే.. వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ ఆడే ఛాన్స్ ఉందని.. అప్పుడు తిలక్ వర్మకు మొండిచెయ్యి ఎదురుకావచ్చునని తెలిపాడు.

పాకిస్తాన్‌ మ్యాచ్‌కు సంజయ్‌ మంజ్రేకర్‌ జట్టు ఇదే..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్/ తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..