Team India: రోహిత్ శర్మ యో-యో టెస్ట్ ఫేక్.. లైవ్‌లో పరీక్షించాలంటూ నెటిజన్ల డిమాండ్?
Rohit Sharma: బెంగళూరులో టీమిండియా ఆసియా కప్ కోసం సన్నద్ధమవుతోంది. ఇక్కడ ఆటగాళ్లందరికి యో-యో టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. ఈ టెస్టులో విరాట్ కోహ్లీతో పాటు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా సులువుగా పాసయ్యారు. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా విజయం సాధించాడు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం హిట్‌మ్యాన్ ఫిట్‌నెస్ టెస్ట్ పాసవ్వలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఆసియా కప్ కోసం టీమిండియా సన్నాహాలు ప్రారంభించింది. తొలిరోజు ఆటగాళ్లందరికి ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించారు. కర్ణాటకలోని ఆలూర్‌లో టీమిండియా క్యాంప్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కెప్టెన్ రోహిత్ శర్మ సహా ఇతర ఆటగాళ్లకు యో-యో టెస్టు నిర్వహించారు. వార్తల ప్రకారం, అందరూ ఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ యో-యో టెస్టులో ఉత్తీర్ణత సాధించడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో చాలా మంది అందరి ముందు యో-యో టెస్ట్ చేయాలని కామెంట్లు చేస్తున్నారు.
రోహిత్ శర్మ యో-యో పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడనే వార్త ఫేక్ అని ఓ అభిమాని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ఈ పరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ మరో వ్యక్తి కామెంట్లు చేస్తున్నాడు.
రోహిత్ యో-యో టెస్టుపై ప్రశ్నలు ఎందుకు?
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, రోహిత్ శర్మ యో-యో పరీక్షను ఎందుకు ఫేక్ అంటున్నారు? నిజానికి రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై ఇలాంటి ప్రశ్నలు తలెత్తడం ఇదే మొదటిసారి కాదు. ఫిట్‌నెస్ విషయంలో చాలా ఏళ్లుగా రోహిత్ సతమతమవుతున్నాడు. భారత కెప్టెన్లు ఎప్పుడూ ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా.. ఇలాంటి ప్రశ్నలే వినిపిస్తుంటాయి.
విరాట్ తప్పు చేశాడా?
Fake news
— Shreyy (@Sadly_shrey) August 24, 2023
రోహిత్ శర్మ యో-యో టెస్ట్‌పై ప్రశ్నలు తలెత్తుతుండగా, మరోవైపు విరాట్ కోహ్లీ కూడా ఈ టెస్ట్ తర్వాత ఇబ్బందుల్లో పడ్డాడు. వాస్తవానికి విరాట్ కోహ్లీ యో-యో టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో తన స్కోర్‌ను పంచుకున్నాడు. ఇది బీసీసీఐకి నచ్చలేదని విశ్వసనీయవర్గాల సమాచారం. దీని తర్వాత, యో-యో స్కోర్‌లను పంచుకోవద్దని బీసీసీఐ ఆటగాళ్లందరికీ సూచించింది.
నలుగురు ఆటగాళ్లకు యో-యో టెస్ట్ ఉండదు..
Kya YO-YO test live ho sakta hai poore desh ke saamne?
— Dr. JANGO (@doctor_jango) August 24, 2023
ఐర్లాండ్ సిరీస్‌లో ఆడని ఆటగాళ్లు మాత్రమే టీమ్ ఇండియా శిబిరంలో టెస్టులు చేయనున్నారు. అంటే జస్ప్రీత్ బుమ్రా, ప్రసీద్ధ్ కృష్ణ, తిలక్ వర్మ, సంజు శాంసన్‌లకు యో-యో పరీక్షలు ఉండవు. వీరిలో ముగ్గురు ఆటగాళ్లు ఆసియా కప్‌నకు ఎంపికయ్యారు. కాగా, సంజు శాంసన్ బ్యాకప్‌గా శ్రీలంక వెళ్లనున్నారు. టీమ్ ఇండియా ఆగస్టు 30న ఆసియా కప్‌నకు బయలుదేరుతుంది. భారత్ తన మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో ఆడనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..