Asia Cup: గత 34 వన్డేల్లో 9 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలతో దూకుడు.. టీమిండియాకు షాకిస్తోన్న పాక్ ప్లేయర్..
Babar Azam Pakistan: సెప్టెంబరు 2న ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో బాబర్ అద్భుత ప్రదర్శన చేసే అవకాశం ఉంది. గత 34 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 9 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు సాధించాడు. బాబర్ ఈ ఏడాది ఇప్పటివరకు 10 వన్డేలు ఆడాడు. ఈ సమయంలో అతను మేలో న్యూజిలాండ్‌పై సెంచరీ చేశాడు. అతను 107 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఏప్రిల్‌లో న్యూజిలాండ్‌పై రెండు అర్ధ సెంచరీలు సాధించాడు.
Babar azam: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 1 వికెట్ తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది. ఈ సిరీస్ తర్వాత ఆసియా కప్ 2023 ప్రారంభమవుతుంది. బాబర్ ఆజం ఈ టోర్నీకి పూర్తిగా సిద్ధమయ్యాడు. గత 34 ఇన్నింగ్స్‌ల్లో అద్భుతాలు చేస్తూ.. దూసుకపోతున్నాడు. అయితే, టీమిండియాకు మాత్రం డేంజర్ బెల్స్ మోగుతున్నట్లు కనిపిస్తోంది.
ఈసారి సెప్టెంబరు 2న ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో బాబర్ అద్భుత ప్రదర్శన చేసే అవకాశం ఉంది. గత 34 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 9 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు సాధించాడు. బాబర్ ఈ ఏడాది ఇప్పటివరకు 10 వన్డేలు ఆడాడు. ఈ సమయంలో అతను మేలో న్యూజిలాండ్‌పై సెంచరీ చేశాడు. అతను 107 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఏప్రిల్‌లో న్యూజిలాండ్‌పై రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. జనవరిలో కూడా రెండు అర్ధ సెంచరీలు నమోదయ్యాయి. గతేడాది ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌పై సెంచరీలు చేశాడు.
పాకిస్తాన్ టీం సెలబ్రేషన్స్..
View this post on Instagram
బాబర్ ఆజం మార్చి 2022 నుంచి వన్డే ఫార్మాట్‌లో 4 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు సాధించాడు. 2022 మార్చిలో లాహోర్‌లో ఆస్ట్రేలియాపై బాబర్ సెంచరీ ఆడాడు. అతను 114 పరుగులు చేశాడు. ఆ తర్వాత, అతను అదే మైదానంలో ఏప్రిల్ 2022లో నాటౌట్ 105 పరుగులు చేశాడు. అతని నిలకడ టీమిండియా సమస్యలను పెంచుతుందనడంలో ఎలాంటి సమస్యలేదు. ఆసియా కప్‌లో భారత్‌తో సహా ఇతర జట్లకు బాబర్ పెద్ద ముప్పుగా మారవచ్చు.
టాస్ సమయంలో బాబర్..
View this post on Instagram
బాబర్ మొత్తం ODI రికార్డు కూడా అద్భుతంగా ఉంది. 100 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 5142 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 18 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలు సాధించాడు. బాబర్ అత్యుత్తమ ODI స్కోరు 158 పరుగులు. ఈ ఫార్మాట్‌లో 51 సిక్సర్లు, 464 ఫోర్లు కొట్టాడు. బాబర్ తన పేరిట ఓ ఆసక్తికరమైన రికార్డు కూడా సృష్టించాడు. 100 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు.
పాకిస్తాన్ టీం ఫోజులు..
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..