Asia Cup: ఆసియా కప్‌లో అత్యధిక సిక్సర్ల కింగ్‌లు వీరే.. అగ్రస్థానంలో మనోడే..

Asia Cup 2023: ఆసియా కప్ ఇప్పటి వరకు రెండు ఫార్మాట్లలో జరిగింది. ఓసారి వన్డే, మరికొన్ని సార్లు టీ20 ఫార్మాట్‌లో జరిగింది. టీమిండియా కూడా ఆసియా కప్ ద్వారా ODI ప్రపంచ కప్ 2023 సన్నాహాలను పరీక్షించనుంది. అందరి దృష్టి భారత స్టార్ ఆటగాళ్లపైనే ఉంటుంది. ఆసియా కప్‌లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Asia Cup: ఆసియా కప్‌లో అత్యధిక సిక్సర్ల కింగ్‌లు వీరే.. అగ్రస్థానంలో మనోడే..
Team India
Follow us

| Edited By: Vimal Kumar

Updated on: Jan 05, 2024 | 5:47 PM

Asia Cup 2023: ఆసియా కప్ టోర్నమెంట్ 2023 ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ టైటిల్‌ను గెలుచుకోవడానికి మరోసారి ఆసియాలోని ఆరు దేశాలు పోటీపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఆసియా కప్‌లో భారత జట్టు సెప్టెంబర్ 2న పాకిస్తాన్‌తో తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. ప్రపంచం మొత్తం చూపు ఈ మ్యాచ్‌పైనే నిలిచింది.

టీమిండియా కూడా ఆసియా కప్ ద్వారా ODI ప్రపంచ కప్ 2023 సన్నాహాలను పరీక్షించనుంది. అందరి దృష్టి భారత స్టార్ ఆటగాళ్లపైనే ఉంటుంది. ఆసియా కప్‌లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ గురించి మాట్లాడితే, భారత కెప్టెన్ రోహిత్ శర్మ నంబర్ వన్ స్థానంలో ఉండగా, పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది నంబర్ టూలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్‌లో రోహిత్ శర్మ పేరిట అత్యధిక సిక్సర్ల రికార్డ్..

ఆసియా కప్ ఇప్పటి వరకు రెండు ఫార్మాట్లలో జరిగింది. ఓసారి వన్డే, మరికొన్ని సార్లు టీ20 ఫార్మాట్‌లో జరిగింది. రెండింటిలోనూ అత్యధికంగా సిక్సర్లు కొట్టడం గురించి మాట్లాడితే, రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు రోహిత్ శర్మ మొత్తం 29 సిక్సర్లు బాదగా, మొత్తం 26 సిక్సర్లు బాదిన పాక్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. సనత్ జయసూర్య 23 సిక్సర్లతో మూడో స్థానంలో ఉండగా, సురేశ్ రైనా 18 సిక్సర్లు కొట్టి నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నీలో ఎంఎస్ ధోని 16 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 15 సిక్సర్లతో ఆరో స్థానంలో ఉన్నాడు.

ఆసియా కప్‌లో అత్యధిక సిక్సర్లు..

29 సిక్సర్లు – రోహిత్ శర్మ

26 సిక్సర్లు – షాహిద్ అఫ్రిది

23 సిక్సర్లు – సనత్ జయసూర్య

18 సిక్సర్లు – సురేష్ రైనా

16 సిక్సర్లు – ఎంఎస్ ధోని

15 సిక్సర్లు – విరాట్ కోహ్లీ

ఆసియా కప్‌లో రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన..

ఆసియా కప్‌లో రోహిత్ శర్మ ప్రదర్శన గురించి మాట్లాడితే, ఈ టోర్నమెంట్‌లో వన్డే ఫార్మాట్‌లో 22 మ్యాచ్‌లలో 21 ఇన్నింగ్స్‌లలో 46.56 సగటుతో 745 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆసియా కప్‌లో అతని అత్యుత్తమ స్కోరు 111 నాటౌట్. ఇందులో రోహిత్ శర్మ మొత్తం 17 సిక్సర్లు కొట్టాడు. అదే సమయంలో ఆసియా కప్ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరిగినప్పుడు రోహిత్ శర్మ 9 మ్యాచ్‌లలో 9 ఇన్నింగ్స్‌లలో 30.11 సగటుతో 271 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు చేశాడు. అత్యుత్తమ స్కోరు 83 పరుగులుగా నిలిచింది. ఇందులో అతను 12 సిక్సర్లు కొట్టగా, మొత్తంగా రోహిత్ శర్మ 29 సిక్సర్లు కొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..