ప్రజలకు తోడుగా నిలుస్తాం.. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు తెనాలి డబుల్ హార్స్ ఫౌండేషన్ విరాళం..
ఇటీవల భారతీయులపై విదేశీయులు తెగ మనసుపారేసుకుంటున్నారు. దేశాన్ని, కుటుంబాన్ని వదిలి ప్రేమించిన వారికోసం ఎల్లలుదాటుతున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అలాంటివి మరి. భారతీయతను ఇష్టపడనివారుండరు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ అమ్మాయి తెలంగాణ అబ్బాయి ప్రేమలో పడింది. అక్కడితో ఆగిపోలేదు.. చక్కగా ఆ అబ్బాయిని భారత సంప్రదాయం ప్రకారం పెళ్లాడి, నిర్మల్‌లో తెలుగింటి కోడలిగా అడుగుపెట్టింది ఆ ఇంగ్లీషు అమ్మాయి.
Tenali Double Horse Foundation: చరిత్రలో ఎన్నడూ చూడని విపత్తు బెజవాడను వణికించింది.. భారీ వర్షాలు, వరదలు ఏపీలో విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేశాయి.. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.. సాయం కోసం లక్షలాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కూడా సాయం అందించాలంటూ అందరినీ కోరుతోంది. వాస్తవానికి.. ఆకలి బాధతో చేతులు చాచే వారికి చేయందించడమే మానవత్వం.. అందుకే.. సాయం చేసేందుకు చాలామంది ప్రముఖులు, పలు కంపెనీల ప్రతినిధులు, ప్రజలు ముందుకొస్తున్నారు.
వరదల బీభత్సంతో విజయవాడలో వేలాది మంది నిరాశ్రయులయ్యారు.. వందలాది ఇళ్లు మునిగిపోయాయి.. ఈ కష్ట సమయాల్లో ఆదుకోవడం సమిష్టి బాధ్యత.. చిన్నా పెద్ద అని తేడా లేకుండా.. తలా ఒక చేయి వేసి కష్టాల్లో ఉన్నవారిని.. నష్టపోయిన వారిని ఆదుకోవడం మన ధర్మం.. అందుకే.. తెనాలి డబుల్ హార్స్ ఫౌండేషన్ మన తోటి పౌరుల జీవితాలను పునర్నిర్మించడంలో సహాయపడటానికి ఈ కీలక సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు నిలబడేందుకు ముందుకొచ్చింది. వరద సహాయక చర్యలలో భాగమయ్యేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10, 00,000/- (పది లక్షల రూపాయలు) విరాళంగా అందించింది. దీనికి సంబంధించిన చెక్ ను (చెక్ నంబర్ 179571) బ్యాంకులో 4 సెప్టెంబర్ 2024 న జతచేసింది. తుఫాను సహాయ కార్యక్రమాల కోసం ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించినందుకు సంతోషిస్తున్నామని పేర్కొంది.
వరదల వల్ల కలిగే బాధలను తగ్గించడానికి ప్రభుత్వం చేపడుతున్న అపారమైన ప్రయత్నాలను తాము గుర్తించామని.. ఈ ప్రయత్నాలకు సహకరించడానికి తమకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెనాలి డబుల్ హార్స్ ఫౌండేషన్ ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వంతో కలిసి పని చేయడం ద్వారా ఈ విపత్తు ద్వారా ఎదురయ్యే సవాళ్లను అధిగమించగలమని.. బాధితుల జీవనాన్ని పునరుద్ధరించడంలో సహాయపడగలమని విశ్వసిస్తున్నట్లు పేర్కొంది.
ఈ కష్ట సమయాల్లో రాష్ట్రాన్ని ఆదుకోవడానికి తాము ఇచ్చిన ఈ విరాళాన్ని అంగీకరించాలని.. ప్రభుత్వ నాయకత్వంలో, ఈ నిధులు అవసరమైన వారికి ఉపశమనం కలిగించడానికి సమర్థవంతంగా ఉపయోగిస్తారని విశ్వసిస్తున్నట్లు పేర్కొంది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రజల పట్ల మీ అచంచలమైన అంకితభావానికి.. తెనాలి డబుల్ హార్స్ ఫౌండేషన్‌ను ఈ కీలక మిషన్‌లో భాగమవ్వడానికి అనుమతించినందుకు ధన్యవాదాలంటూ పేర్కొంది. ఈ మేరకు తెనాలి డబుల్ హార్స్ ఫౌండేషన్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది.