Ugadi-Srisailam: శ్రీశైలంలో వైభవంగా ఉగాది ఉత్సవాలు .. కన్నడ భక్తుల నడుమ స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం

అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేక వేదికపై మహాదుర్గ అలంకారరూపంలో ఆశీనులైన అమ్మవారికి, శ్రీ స్వామి వారికి వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూరహారతులిచ్చారు.

Ugadi-Srisailam: శ్రీశైలంలో వైభవంగా ఉగాది ఉత్సవాలు .. కన్నడ భక్తుల నడుమ స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం
Srisalam Ugadi ]
Follow us
Surya Kala

|

Updated on: Mar 21, 2023 | 7:18 AM

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం.. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. శ్రీశైలం ఆలయంలో ఉగాది పండుగ తెలుగు క్యాలెండర్‌లోని చైత్ర మాసంలో ఐదు రోజుల పాటు జరుపుకునే గొప్ప కార్యక్రమం. ఈ ఉత్సవాల్లో రెండో రోజులో భాగంగా మహాదుర్గ అలంకార రూపంలో శ్రీభ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చారు. అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేక వేదికపై మహాదుర్గ అలంకారరూపంలో ఆశీనులైన అమ్మవారికి, శ్రీ స్వామి వారికి వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూరహారతులిచ్చారు.

మల్లికార్జున, భ్రమరాంబ దంపతుల ఉత్సవమూర్తులు బాజా భజంత్రీలు, బ్యాండ్ వాయిద్యాలు, డప్పు చప్పుల్లు, కోలాటాలు, లంబాడీల ఆటపాటల నడుమ శ్రీశైల క్షేత్రపురవీధుల్లో విహరించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లకు పూజలను చేశారు. ఆది దంపతులను దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు. కన్నడ భక్తుల నడుమ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించారు. వేలాదిమంది కన్నడ భక్తులు శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకొని పునీతులైనారు.

శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవలు సందర్భంగా విద్యుత్ దీపాలంకరణతో ఎంతో దేదీప్యమానంగా, చూసేవారి కన్నులు మిరిమిట్లు గొలుపుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..