Dream: మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే సంపద అదృష్టం మీ సొంతం.. అవి చెప్పే సలహాలు ఏమిటో తెలుసా..

స్వప్న శాస్త్రం ప్రకారం..  కలల ప్రభావం మానవ జీవితంపై తీవ్రంగా ఉంటుంది. భవిష్య పురాణం ప్రకారం.. కలలు సూర్యారాధనకు దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. ఒక వ్యక్తి తన కలలో సూర్యుడు, ఇంద్రధనస్సు, చంద్రుడు కనిపిస్తే..

Dream: మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే సంపద అదృష్టం మీ సొంతం.. అవి చెప్పే సలహాలు ఏమిటో తెలుసా..
Dreams
Follow us
Surya Kala

|

Updated on: Dec 04, 2022 | 2:23 PM

ప్రతి వ్యక్తి నిద్రలో రకరకాల కలలు కంటాడు. ఒకొక్క సారి ఒకొక్క రకం కలలు వస్తాయి. ఆ కలల్లో రకరకాల విషయాలను చూస్తాడు. కొంతమంది మంచి జరుగుతున్నట్లు కలలు వస్తే.. మరికొందరికి వచ్చే కలలు చెడు జరుగుతున్నట్లు.. లేదా భయంకరమైన సన్నివేశాలు కలలు వస్తాయి. తెల్లవారు జామున వచ్చే కలలు నిజమవుతాయని హిందువుల నమ్మకం.. అంతేకాదు కొన్ని కలలు వారి వారి భవిష్యత్ లో జరగబోయే మంచి చెడులు ప్రతీకని స్వప్న శాస్త్రంలో పేర్కొన్నారు. స్వప్న శాస్త్రం ప్రకారం..  కలల ప్రభావం మానవ జీవితంపై తీవ్రంగా ఉంటుంది. భవిష్య పురాణం ప్రకారం.. కలలు సూర్యారాధనకు దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. ఒక వ్యక్తి తన కలలో సూర్యుడు, ఇంద్రధనస్సు, చంద్రుడు కనిపిస్తే.. ఆ వ్యక్తి జీవితంలో అనేక రకాల ఆనందం, శ్రేయస్సును పొందుతాడు. ఈరోజు  ఏ కలలను శుభప్రదంగా భావిస్తారో వివరంగా తెలుసుకుందాం.

ఏ విషయాలు కలలోకి వస్తే శ్రేయస్కరం అంటే.. నది లేదా సముద్రం నుండి నీరు త్రాగుతున్నట్లు పర్వత పడిపోతున్నట్లు రథ యాత్ర బంగారు ఆభరణాలు కనిపిస్తే చెట్లు నాటుతున్నట్లు జుట్టు ఊడిపోతున్నట్లు అద్దంలో అలంకరణ చేసుకున్నట్లు కనిపిస్తే చేపలు, పీతలు, రొయ్యలు వంటి జల చరాలు కనిపిస్తే.. తామర పువ్వు కనిపిస్తే ఆడుతున్నట్లు కలలోకి వస్తే..

ఈ విషయాలు కలలో కనిపిస్తే.. మహారాజు భోగం కట్టిన ఆవు గేదెను చూడండి సింహం దర్శనం

ఇవి కూడా చదవండి

వీరు కలలో కనిపించి చెప్పే సలహాలు  కలలో దేవతలు, దేవుళ్ళు, మహాపురుషులు, వృద్ధులు, పూర్వీకులు, గురువులు ఎవరైనా కనిపించి ఏదైనా చేయమని చెబితే, వారి సలహాలను నిర్లక్ష్యం చేయకుండా వాటిని పాటించండి.

కలలో నెమలి కనిపిస్తే..  స్వప్న శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి తన కలలో నెమలిని చూస్తే, అది చాలా శుభకరమైన కల. దేవుడికి ప్రీతిపాత్రమైన నెమలి. నెమలి దర్శనంతో ఆ వ్యక్తి  ప్రతికూల పరిస్థితుల నుంచి విముక్తం అవుతారు. కలలో నెమలి డ్యాన్స్ చేస్తూ కనిపిస్తే దైవానుగ్రహం మీపై కురుస్తుందని అర్థం చేసుకోవాలి.

కలలో కాకులు కనిపిస్తే.. కలలో కాకులను చూడటం శుభప్రదంగా భావిస్తారు. ఈ కల ధనప్రాప్తిని సూచిస్తుంది. ఇది కాకుండా, హంసను చూడటం కూడా శుభ స్వప్నం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)