Sri Rama Navami: కలిపురుషుడు అయోధ్యలో అడుగు పెట్టడానికి రామయ్య.. హనుమంతుడిని ఎక్కడకు పంపించాడో తెలుసా..

అయోధ్యకు కావాలిగా ఉన్న హనుమంతుడ్ని దాటి కాలపురుషుడు అయోధ్యలోకి అడుగు పెట్టాలి. రామ భక్తుడైన  హనుమంతుడు నగరానికి కావలి ఉన్నంతసేపు యముడు లోనికి రాలేడు. దీంతో రామయ్య తన ఉంగరం తన భవనంలో ఉన్న నేల పైన చిన్న బీటలోకి పడవేసి హనుమంతుడిని ఆ ఉంగరం పట్టుకురమ్మని ఆజ్ఞాపించాడు.

Sri Rama Navami: కలిపురుషుడు అయోధ్యలో అడుగు పెట్టడానికి రామయ్య.. హనుమంతుడిని ఎక్కడకు పంపించాడో తెలుసా..
Lord Sri Rama
Follow us
Surya Kala

|

Updated on: Mar 27, 2023 | 1:45 PM

శ్రీ మహావిష్ణువు రావణాసుర సంహారం కోసం శ్రీరాముడిగా జన్మించాడు. మనిషిగా పుట్టి గుణగణాలలో దేవుడిగా పూజలను అందుకున్నాడు. రామయ్య పుట్టిన రోజుని శ్రీ రామ నవమిగా అత్యంత ఘనంగా దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు. రాముడు జీవితంలో ముఖ్య ఘట్టాలైన జననం,  కళ్యాణం, పట్టాభిషేకం కూడా చిత్ర మాసంలోని నవమి రోజున అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే శ్రీ రాములడు అవతార పరిసమాప్త సమయంలో బ్రహ్మదేవుడు..అవతారం ఉపసంహరణ కోసం రామయ్య వద్దకు  కాలపురుషుడిని రాముని వద్దకు పంపుతాడు.

శ్రీరాముడు కూడా “దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని” 11,000 సంవత్సరాల రాజ్యపాలన పూర్తి చేశాడు. తాను అవతారం ఎత్తడానికి గల కారణం పూర్తవ్వడంతో తన నివాసం వైకుంఠం చేరాలని భావిస్తాడు. అందుకు తగిన సమయం కోసం చూస్తూ వుంటారు.

అయితే అయోధ్యకు కావాలిగా ఉన్న హనుమంతుడ్ని దాటి కాలపురుషుడు అయోధ్యలోకి అడుగు పెట్టాలి. రామ భక్తుడైన  హనుమంతుడు నగరానికి కావలి ఉన్నంతసేపు యముడు లోనికి రాలేడు. దీంతో రామయ్య తన ఉంగరం తన భవనంలో ఉన్న నేల పైన చిన్న బీటలోకి పడవేసి హనుమంతుడిని ఆ ఉంగరం పట్టుకురమ్మని ఆజ్ఞాపించాడు.

హనుమంతుడు కామరూపం ధరించి చిన్న కీటకం ప్రమాణంలో ఆ బిలంలోకి వెళ్లి.. చివరికి పాతాళానికి చేరుకుంటాడు.  అక్కడ వాసుకి అంజనేయస్వామిని గుర్తించి మర్యాదలు చేసి.. వచ్చిన కార్యం గురించి అడుగుతాడు. శ్రీరాములవారి అంగుళీయం గురించి చెప్పి ఆ చోటు చూపమని అభ్యర్దిస్తాడు. అప్పుడు వాసుకి ఒక గుట్టలా ఉన్న ఉంగరాలున్న చోటు చూపించి అందులో రాముని ఉంగరం తీసుకోమని చెబుతాడు. శ్రీరాముని ప్రార్ధించి తీసిన మొదటి ఉంగరం అదృష్టవశాత్తు శ్రీరాముని ఉంగరంగా గుర్తించి ఆనందిస్తాడు హనుమంతుడు. వాసుకి మరొకటి చూడు అని చెప్పగా, అది కూడా అచ్చం శ్రీరాముని ఉంగరంలానే వుంటుంది. అలా అక్కడ గుట్టగా ఉన్న అన్ని ఉంగరాలు కూడా శ్రీరాముని ఉంగరాలే అని ఆశ్చర్యపోతున్న హనుమంతునికి చెబుతాడు వాసుకి.

అప్పుడు ఈ మాయ ఏమిటి స్వామి అంటూ వాసుకిని అడగగా.. ఇవన్నీ రామయ్య ఉంగరాలు.. ఇవన్నీ ప్రతీ కల్పంలో శ్రీరాముడు అవతారామ్ దాలుస్తారు. ఆనంరం అవతార సమాప్తి సమయంలో ఒక ఉంగరం వచ్చి పడుతుంది.. ఆ ఉంగరాన్ని వెదుకుతూ..  ఒక మర్కటం వస్తుంది. ఇదేమిటని అడుగుతుంది.  అయిదు ఇప్పుడు కాలుని ఆపడం, తద్వారా శ్రీరామ అవతార సమాప్తి ఆపే శక్తి హనుమంతునికి లేదని చెబుతాడు.

కాలం అనంతం. అనాది నుండి ఈ కాలప్రవాహంలో ఎన్నో కల్పాలు వచ్చాయి పోయాయి, వస్తాయి..పోతాయి.. కూడా. కానీ ఎప్పటికీ ఆ పరబ్రహ్మం మాత్రమే శాశ్వతం. ఆయన లీలలు అనంతం. ఈ అనంతప్రవాహంలో ఎన్నో ప్రాణులు పుడతాయి గిడతాయి, మళ్ళీ పుడుతూ ఉంటాయి. పుట్టిన ప్రతీది కాలగర్భంలో కలవకమానదు, చివరకు అవతారం స్వీకరించిన పరబ్రహ్మ స్వరూపమైనా. ఈ కాల స్వరూపమే పరబ్రహ్మ, చివరకు అన్నీ ఆయనలోనే లీనమౌతాయి. ఇటువంటి విషయం కేవలం మన సనాతనధర్మం మాత్రమె చెప్పింది. ఈ నాటకం నిరంతరం జరుగుతూ వుంటుంది. ఈ నాటకం రక్తి కట్టించడానికి స్వామీ కూడా ఒక పాత్ర ధరిస్తాడు, రంజింపచేస్తాడు, ధర్మాన్ని నిలుపుతాడు.

హనుమంతుడిలా చిరంజీవిగా నమ్మి కిలిస్తే ఈ కాలప్రవాహాన్ని దాట గలడు. రామయ్యను , జనుమంతుడిని భక్తితో శరణాగతి చెయ్యడం. అందుకే కాలుడు ఆయన నామాన్ని పట్టుకున్న హనుమంతుడి వద్దకు వెళ్ళలేడు. అటువంటి హనుమంతుని త్రికరణశుద్దిగా పట్టుకున్న భక్తులను అకాలమృత్యువు పాల్పడరు.  అన్ని కాలాలలో రక్షించి ముక్తిని ఇచ్చే ఆ పరబ్రహ్మ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడే మనల్ని ఉద్ధరించగలిగినవాడు. అన్నమయ్య చెప్పినట్టు..వెంకటాద్రి పైన ఉన్న ఈ సర్వేశ్వరుడే మనకు సర్వ రక్ష. మరిన్ని ఆధాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..