Nalgonda: తవ్వకాల్లో బయల్పడ్డ పురాతన గంగమ్మ తల్లి విగ్రహం.. కాకతీయుల కాలం నాటిదిగా గుర్తింపు

వైభవానికి చిహ్నంగా అనేక విగ్రహాలు, వస్తువులు తవ్వకాల్లో తరచుగా దేశంలో ఎక్కడోచోట లభ్యమవుతూనే ఉంటాయి. ఇవి అప్పటి రాజుల వైభవానికి చిహ్నంగా సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తులుగా నిలుస్తున్నాయి.

Nalgonda: తవ్వకాల్లో బయల్పడ్డ పురాతన గంగమ్మ తల్లి విగ్రహం.. కాకతీయుల కాలం నాటిదిగా గుర్తింపు
Gangamma Thalli Idol In Telangana
Follow us
Surya Kala

|

Updated on: Jan 03, 2023 | 11:26 AM

మనదేశంలో ప్రసిద్ధి క్షేత్రాలు, రహస్యలను దాచుకున్న ఆలయాలు అనేకం ఉన్నాయి. అంతేకాదు గత తాలూకా హిందూ సనాతన ధర్మం వైభవానికి చిహ్నంగా అనేక విగ్రహాలు, వస్తువులు తవ్వకాల్లో తరచుగా దేశంలో ఎక్కడోచోట లభ్యమవుతూనే ఉంటాయి. ఇవి అప్పటి రాజుల వైభవానికి చిహ్నంగా సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తులుగా నిలుస్తున్నాయి. తాజాగా తెలంగాణాలోని ఉమ్మడి నల్గొండ జిలాల్లో జరిపిన తవ్వకాల్లో అతి పురాతన విగ్రహం లభ్యం అయింది. వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని  అనుముల మండలం హాలీయా మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ సమీపంలో పురాతన విగ్రహం బయటపడింది. పట్టణ ప్రగతి అభివృద్ధిలో భాగంగా కౌన్సిలర్ రాజా రమేష్ సుధారాణి జెసీబీ సహాయంతో అక్కడ క్లీన్ చేస్తుండగా ఒక విగ్రహం బయటపడింది. స్థానిక పురోహితులకు సమాచారం ఇవ్వగా పురోహితులు ఇది కాకతీయుల కాలం నాటి పురాతనమైన గంగమ్మ తల్లి విగ్రహం అని చెప్పారు.. దీంతో విగ్రహాన్ని చూడడానికి నాగార్జునసాగర్ నియోజకవర్గం నలుమూలల నుండి భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు.

Gangamma Thalli Idol

Gangamma Thalli Idol

గంగమ్మ తల్లికి నిండుకుండ నీటితో అభిషేకాలు చేశారు. పసుపు, కుంకుమార్చనలు చేస్తూ టెంకాయలు కొడుతూ పూజలను నిర్వహిస్తున్నారు. పూల దండలు వేసి పూజలు చేస్తున్నారు. గంగమ్మ తల్లిని చూసిన భక్తులంతా భక్తి పరవశంలో మునిగిపోయారు. ఆ గంగమ్మ తల్లి మా కాలనీలో స్వయంభువుగా వెలియడం అదృష్టంగా భావిస్తున్నాం అంటూ ఆనందం వ్యక్తం చేశారు కాలనీవాసులు. త్వరలోన అందరి సహాయ సహకారాలలో అమ్మవారికి ఆలయం నిర్మిస్తామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..