Wildfires Forest: హవాయిలో నాలుగు రోజులుగా దహించుకుపోతున్న అడవి.. 39 మంది మృతి.. జాతీయ విపత్తుగా ప్రకటన..
అమెరికాలోని హవాయిలో అడవులు దహించుకుని పోతున్నాయి. ఈ దహన కాండను భారీ విపత్తుగా అక్కడ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న హవాయి ద్వీపంలోని అడవి కాలిపోతోంది. ఈ అగ్ని బారిన పడి చాలా మంది చనిపోయారు. అదే సమయంలో అధ్యక్షుడు జో బిడెన్ ఇప్పుడు ఈ ప్రమాదాన్ని భారీ విపత్తుగా ప్రకటించారు.