ఇలాంటి సమస్యలకు నోటి ద్వారా తీసుకునే మందులు, షాంపూలు, లోషన్లు చాలానే ఉన్నాయి. అయితే, ఔషధాల్లో ఉండే పదార్థాలు ఎక్కువగా వాడటం వల్ల చర్మ సంబంధిత సమస్యలు, చికాకు, అలెర్జీ, రక్తపోటు, నపుంసకత్వం వంటి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ మార్గాలు వాడటం మంచిదని సూచిస్తున్నారు.