డయాబెటిక్ ఐ ఎవరిలో ఎక్కువ: రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించలేకపోవడం వల్ల అది కండ్లను ప్రభావితం చేస్తుంది. ఎక్కువ కాలం మధుమేహం ఉన్న వ్యక్తులు, డయాబెటిస్ లక్షణాలు ఉన్న గర్భిణీలు, దీర్ఘకాలంపాటు రక్తంలో గ్లూకోజ్‌ను అదుపుచేయని వారు, రక్తంలో అధిక కొలెస్ట్రాల్ కలిగి ఉన్నవారు, అధిక రక్తపోటు ఉన్నవారిలో డయాబెటిక్ ఐ కనిపిస్తుంది. అలాగే, సిగరెట్ స్మోకింగ్ చేసేవారిలో, ఊబకాయులు కూడా డయాబెటిక్ ఐ కి గురయ్యే ప్రమాదం ఉన్నది. ఇది మన జీవన నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది. మధుమేహులు తప్పనిసరిగా రక్తంలో చక్కెరల స్థాయిలను నియంత్రించేలా చూసుకోవడం అవసరం.