మేషం: ఈ రాశివారికి గృహ కారకుడైన గురువు అనుకూలంగా ఉన్నందువల్లచ గృహ (నాలుగవ) స్థానంలో ప్రస్తుతం శుక్ర, రవులు సంచారం చేస్తున్నందువల్ల తప్పకుండా గృహయోగం కలుగుతుంది. ఇల్లు కట్టుకోవడానికి, దాన్ని అందంగా, ఆకాంక్షలకు తగ్గట్టుగా తీర్చిదిద్దుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగ భద్రతకు,
ఆర్థిక స్థిరత్వానికి అవకాశం ఉంది కాబట్టి, ఎంత త్వరగా ప్రయత్నం మొదలుపెడితే అంత మంచిది. సమయం అనుకూలంగా ఉంది.