మీనం: ఈ రాశివారికి భాగ్యాధిపతి అయిన కుజుడు అనుకూల స్థానాలలో లేనప్పటికీ, భాగ్య కారకుడైన గురువు రెండవ స్థానంలో ఉండడం, ఉద్యోగ స్థానాన్ని
వీక్షిస్తుండడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో వేగంగా పురోగతి చెందడం, శత్రు, రోగ, రుణ బాధలు తగ్గడం, ఆశించిన దాని కంటే మించి ఆదా యం పెరగడం, పిల్లలు
వృద్ధిలోకి రావడం వంటివి జరుగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామి జీవితంలో పురోగతి ఉంటుంది. దాంపత్య జీవితం సాఫీగా సాగి
పోతుంది.