మకరం: ఈ రాశివారికి ఎక్కువగా చర్మవ్యాధులు, రక్త సమస్యలు, కీళ్ల నొప్పులు, నరాల సమస్యలు పట్టి పీడిస్తుంటాయి. సాధారణంగా ఆహార, విహారాల్లో క్రమశిక్షణ
పాటించడం, వ్యసనాలకు దూరంగా ఉండడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వంటివి ఉన్నప్పటికీ, ఈ ఏడాది ఈ రాశివారికి చర్మవ్యాధులు, కీళ్ల నొప్పులు పట్టుకునే సూచనలున్నాయి. వైద్య ఖర్చులు మరీ ఎక్కువగా పెరిగే అవకాశం లేదు. ఈ రాశివారికి వాకింగ్, వ్యాయామం వంటివి ఎక్కువగా మేలు చేస్తాయి.