ధనుస్సు : ఈ రాశికి సింహరాశిలో బుధ, రవుల కలయిక వల్ల బుధాదిత్య యోగంతో పాటు, ధర్మకర్మాధిపతి యోగం (9, 10 స్థానాల అధిపతుల కలయిక) కూడా ఏర్పడుతోంది. రాజకీయాలు, ప్రభుత్వం, రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో ఉన్న వారికి వైభవం పెరుగుతుంది. ఈ రాశివారికి తప్పకుండా అదృష్టం పడుతుంది. సామాజికంగా, ఆర్థికంగా గుర్తింపు పొందడం జరుగుతుంది. నిరుద్యోగులు ఆశించిన దాని కంటే మంచి ఉద్యోగం సంపాదించుకునే వీలుంది. తండ్రికి కూడా కలిసి వస్తుంది.