జాతక చక్రంలో పన్నెండు రాశులు ఉన్నప్పటికీ, ఇందులో అయిదు రాశులవారిలో పట్టుదల, మొండితనం ఏ పాలు ఎక్కువగా వ్యక్తం అవుతుంటాయి. వీరు ఎవరి మీదా
ఆధారపడకుండా సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు చేస్తుంటారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానిని వీరు మార్చుకోవడం జరగదు. ఈ లక్షణాలు చిన్నప్పటి నుంచే వీరిలో కనిపిస్తుంటాయి. ఇది చివరి క్షణం వరకూ కొనసాగుతుంది. చివరి వరకూ ఈ రాశుల వారు సాధారణంగా ఎవరి మీదా ఆధార పడరు. ఆధారపడాల్సిన పరిస్థితి తెచ్చుకోరు. ఈ రాశులవారికి విలక్షణమైన వ్యక్తిత్వాలు. ఈ రాశులు మేషం, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. ఈ రాశులకు చెందిన వ్యక్తుల గురించి
విపులంగా తెలుసుకుందాం.