Over Sleeping: అతిగా నిద్రపోతున్నారా..? అయితే మీ గుండె ప్రమాదంలో పడినట్లే.. తస్మాత్ జాగ్రత్త..!

Hypersomnia: సంపూర్ణమైన ఆరోగ్యానికి పోషకాలతో కూడిన ఆహారం అవశ్యకం అయినట్లుగానే సరిపడినంత నిద్ర కూడా అంతే అవశ్యకం. ప్రతి రోజూ కనీసం 8, 9 గంటల పాటు నిద్రించినవారు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అయితే కొందరు అంతకుమించి నిద్రపోతుంటారు. అది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. అతిగా నిద్రపోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని, గుండెపై కూడా చెడు ప్రభావం పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో అతినిద్ర వల్ల ఏయే సమస్యలు ఎదురవుతాయో ఇప్పుడు చూద్దాం..

శివలీల గోపి తుల్వా

| Edited By: Vimal Kumar

Updated on: Sep 05, 2023 | 4:00 PM

గుండె వ్యాధులు: గుండె జబ్బులకు అతి నిద్ర కూడా ఓ కారణం. నిద్రంచే సమయంలో రక్త ప్రసరణ సాధారణం కంటే నెమ్మదించి గుండె పనితీరుపై చెడు ప్రభావం పడేలా చేస్తుంది. ఇంకా అధ్యయనాల ప్రకారం ప్రతి రోజూ 9 గంటల కంటే ఎక్కువగా నిద్రపోయే వారితో పోలిస్తే, రోజులో 7, 8 గంటలు నిద్రపోయే వ్యక్తుల్లో గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ.

1 / 5
తలనొప్పి: అతిగా నిద్ర పోవడం వల్ల తలనొప్పి కలిగే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. 8 గంటల కంటే ఎక్కువగా నిద్రించడం వల్ల మెదడులోని కొన్ని రకాల న్యూరో ట్రాన్స్‌మీటర్ల‌పై చెబు ప్రభావం పడి తలనొప్పికి దారితీస్తుంది. అలాగే రాత్రి వేళల్లో సరిగ్గా నిద్రలేకున్నా తలనొప్పి ఎదురవుతుంది.

2 / 5
ఊబకాయం: అతి నిద్ర ఊబకాయానికి దారి తీస్తుంది. 8 గంటలకు మించి నిద్రపోతే త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంది. నిద్రించే సమయంలో జీవక్రియల పనితీరు నెమ్మదిస్తుంది. ఈ సమయంలో కొవ్వు శరీరంలో పేరుకుపోతుంటుంది. అతిగా నిద్రపోవడం వల్ల దీని పరిమాణం పెరిగే అవకాశం ఉన్నందున బరువు పెరుగుతారు.

3 / 5
డయాబెటిస్: అతి నిద్ర డయాబెటిస్‌కు కూడా దారి తీస్తుంది. నిద్రించే సమయంలో రక్తప్రసరణ నెమ్మదిగా జరుగుతుంది. ఈ క్రమంలోనే శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగి మధుమేహానికి దారి తీస్తుంది.

4 / 5
డిప్రెషన్: సరిగ్గా నిద్రలేకపోతే డిప్రెషన్‌తో బాధపడతారు. అయితే అతి నిద్ర కూడా డిప్రెషన్‌కు దారితీస్తుంది. ఈ కారణంగా అతిగా నిద్రించకపోవడమే ఆరోగ్యానికి మంచిది

5 / 5
Follow us