Serena Williams:41 ఏళ్ల వయసులో రెండోసారి గర్భవతి.. బేబీ బంప్‌తో సెరెనా ఫోటో సూట్..
అమెరికా టెన్నిస్ సూపర్ స్టార్ సెరెనా విలియమ్స్ రెండోసారి తల్లికాబోతుంది. ఈ సంగతిని ఆమె స్వయంగా చెప్పింది. తన కూతురు కోరుకున్నట్లుగా ఆమెకు తోబుట్టువును గిఫ్ట్ గా ఇవ్వబోతున్నామని సోషల్ మీడియాలో చెప్పింది. అంతేకాకుండా ఈ సంతోషకరమైన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసింది. తన వయసు ఇప్పుడు 41 అని కూడా చెప్పింది.