మార్స్ రోవర్ తీసిన కొత్త చిత్రాల ప్రకారం.. మార్స్‌పై ఒకప్పుడు నదులు, నీటి ప్రవాహాలు, సరస్సులు చాలా ఉండేవని తెలుస్తోంది. విశేషమేమిటంటే, ఈ నదులు ఊహించిన దానికంటే చాలా లోతుగా, వేగంగా ప్రవహించే స్థాయిలో ఉన్నాయని ఆ ఫోటోలను బట్టి అంచనా వేస్తున్నారు నిపుణులు. ఈ లెక్కన.. నదుల ఉనికి బట్టి జీవం కూడా ఉండే అవకాశం ఉండే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు పరిశోధకలు.