Phani CH |
Updated on: May 15, 2023 | 6:39 PM
టిడిపి కార్యకర్తల ఆనందోత్సాహాల నడుమ ప్రారంభమైన యువగళం 100వ రోజు పాదయాత్ర.
యువనేత లోకేష్ తో కలిసి అడుగులు వేస్తున్న తల్లి భువనేశ్వరి, నందమూరి కుటుంబసభ్యులు.
భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో ఉత్సాహంగా సాగుతున్న యువగళం పాదయాత్ర.
జైలోకేష్, జై తెలుగుదేశం నినాదాలతో హోరెత్తుతున్న యువగళం పాదయాత్ర మార్గం.
పెద్దఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు, 3 కి.మీ. మేర స్థంభించిన ట్రాఫిక్.
బాణాసంచా మోతలు, డప్పుల చప్పుళ్లు, నినాదాల హోరుతో జాతరను తలపిస్తున్న యువగళం.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా మోతుకూరు లో పైలాన్ ఆవిష్కరించిన నారా లోకేష్.
కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి, నారా, నందమూరి కుటుంబ సభ్యులు, టిడిపి సీనియర్ నేతలు, యువగళం పాదయాత్ర టీం.
100 రోజుల పాదయాత్ర కు గుర్తుగా 100 మొక్కలు నాటిన టిడిపి నేతలు.